రకుల్ కు ఆ పని పెట్టడం లేదట!

Thu Apr 18 2019 23:52:39 GMT+0530 (IST)

Rahul Ravindran on about Rakul Preet Singh Role in manmadhudu 2

అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'మన్మధుడు 2' సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటుగా అప్పుడప్పుడూ ఏదో ఒక రూమర్ కూడా హల్చల్ చేస్తోంది.  రీసెంట్ గా రకుల్ వెయిట్ గురించి అలాంటి రూమరే ఒకటి ఫిలిం నగర్ లో వినిపించింది.బాలీవుడ్ సినిమా 'దే దే ప్యార్ దే' లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమానుంచి కొద్దిరోజుల క్రితం వడ్డీ షరాబన్ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు.  ఈ పాటలో రకుల్ జీరో సైజ్ లో కనిపించింది. ఈ విషయంపై నాగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నాగ్ బాలీవుడ్ ప్రేక్షకులకు ఆ జీరో సైజులు ఒకే కానీ తెలుగు ప్రేక్షకులు నచ్చారని.. కొంత వెయిట్ పెరగమని రకుల్ కు సూచించాడని వార్తలు వచ్చాయి.  వెయిట్ పెరిగిన తర్వాతే రకుల్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుదామని కూడా నాగ్ చెప్పారని టాక్ వినిపించింది.  ఈ వార్తలపై ఏకంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు.

రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "రూమర్లకు భిన్నంగా మొదటి రోజు నుంచి పోర్చుగీస్ షెడ్యూల్ లో రకుల్ మాతోపాటే షూటింగ్ లో పాల్గొంటూ ఉంది.  అప్పటి నుంచి మేము రకుల్ లుక్స్ చూసి ఎంత స్టన్నింగ్ గా ఉందో అని అనుకుంటూనే ఉన్నాం. రకుల్ మా సినిమాలో నటిస్తున్నందుకు మేము లక్కీ.  తను చాలా టాలెంటెడ్ హీరోయిన్." అంటూ క్లారిటీ ఇచ్చాడు.. అంటే రకుల్ కు నాగార్జున బరువు పెరగమని సూచించడం అంతా రూమరేనన్నమాట.  మరో ట్వీట్ లో నాగార్జున ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్న రెండు ఫోటోలను పోస్ట్ చేసి నాగార్జున ఫిట్నెస్ గురించి "ఫిట్నెస్ గోల్స్.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మీకోసమే" అంటూ సర్ ప్రైజ్ ఇచ్చాడు.