సైకిల్ ఎక్కిన దర్శకేంద్రుడు...!

Mon Jul 13 2020 09:15:56 GMT+0530 (IST)

Raghavendra Rao On Bicycle

తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు. సినిమాని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన దర్శకుడు రాఘవేంద్రరావు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రరావు నవరసాలు కలబోసిన చిత్రాలను తీసి ప్రేక్షకులను రంజింపజేసారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు దర్శకేంద్రుడు అని పిలుచుకుంటారు. హీరో హీరోయిన్స్ ని తెరపై ఎంత అందంగా చూపించాలో.. ఏ యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు తెలిసినంతగా మరే డైరెక్టర్ కి తెలియదు. టాలీవుడ్ లో ఒకప్పటి సీనియర్ హీరోలందరితో సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఈ జనరేషన్ హీరోలతో కూడా సినిమాలు రూపొందించారు.కాగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అందరు సెలబ్రిటీల మాదిరి రాఘవేంద్రరావు కూడా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతూ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాఘవేంద్రరావు తాజాగా మరో వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో తన ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి ''ప్రపంచం మనకు అందించే వాటిలో ఉత్తమమైనవి.. ప్రకృతి ఫిట్నెస్ మరియు నమ్మదగిన స్నేహితుడు!'' అని ట్వీట్ ని జత చేశారు. ఇక రాఘవేంద్రరావు సైకిల్ తొక్కుతుంటే వెనకాలే ఆయన పెట్ డాగ్ ఫాలో అవుతూ ఉంది. 78 ఏళ్ళ వయసులో కూడా వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారంటూ నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.