Begin typing your search above and press return to search.

వీడియో: శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ వార‌సుడితో ద‌ర్శ‌కేంద్రుని ఎలివేష‌న్ ఆ లెవ‌ల్లో..!

By:  Tupaki Desk   |   30 July 2021 8:48 AM GMT
వీడియో: శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ వార‌సుడితో ద‌ర్శ‌కేంద్రుని ఎలివేష‌న్ ఆ లెవ‌ల్లో..!
X
`పెళ్లి సంద‌D` చిత్రంతో టాలీవుడ్ లో స‌త్తా చాటాల‌న్న క‌సితో ఉన్నాడు శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్. ఈ న‌వ‌త‌రం హీరో ని ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మ‌రో స్థాయిలో ఎలివేట్ చేయాల‌న్న త‌ప‌న‌తో ప‌ని చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌- ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్ పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న `పెళ్లి సంద‌D`తో మ‌రోసారి మ్యాజిక్ ను రిపీట్ చేయాల‌న్న‌ది ప్లాన్.

ఈ చిత్రంతో రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తాజాగా చిత్ర‌బృందం ఈ మూవీలో వ‌శిష్ఠ పాత్ర‌లో కె.రాఘ‌వేంద్ర‌రావు ని లాంచ్ చేస్తున్నామ‌ని రివీల్ చేశారు. రాఘ‌వేంద్రుడు ఇంత‌కుముందు గెస్ట్ గా సింగిల్ షాట్ లో క‌నిపించినా.. మేకింగ్ విజువ‌ల్స్ గా క‌నిపించినా కానీ న‌టుడిగా తెర‌పై క‌నిపించ‌లేదు. కానీ తొలిసారి రోష‌న్ చిత్రంతో న‌టుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇక రాఘ‌వేంద్ర‌రావు ఎలివేష‌న్ ఆ రేంజులోనే ఉంది మ‌రి. ఇంత‌కీ అత‌డు రాఘ‌వేంద్రుడేనా.. అల్ట్రా రిచ్ కింగ్ ఫిష‌ర్ య‌జ‌మాని విజ‌య్ మాల్యానా? అనే రేంజులో అత‌డి లుక్ స‌ర్ ప్రైజ్ చేసింది. అలా బేస్ బాల్ ఆడుతూ ఎంతో స్టైలిష్ గా క‌నిపించారు ద‌ర్శ‌కేంద్రుడు. న‌టుడిగా అత‌డు త‌న‌దైన ముద్ర వేస్తార‌నే న‌మ్మ‌కాన్ని పెంచింది ఈ లుక్. ఇంత‌కాలం ద‌ర్శ‌కుడిగా కొన‌సాగిన కె.రాఘ‌వేంద్ర‌ర‌రావు న‌టుడిగా తెర‌పై ఎలా ఆవిష్క‌రించ‌నున్నారో చూడాల‌న్న ఆస‌క్తి కూడా పెరిగింది. ఇక రోష‌న్ భుజాల‌పై చెయ్యేసి విజువ‌ల్స్ లో అలా స్టైలిష్ గా న‌డిచొస్తున్న తీరు ఆక‌ట్టుకుంది. అలాగే రోష‌న్ తో పాటు నాటి పెళ్లి సంద‌డి ఫేం దీప్తి భ‌ట్నాగ‌ర్ ఓ ఫోటోలో ఛ‌మ‌క్కున మెర‌వ‌డం కొస‌మెరుపు.

నాటి క్లాసిక్ సెన్సేష‌న్ మ‌ళ్లీ రిపీట్ చేస్తారా?

90ల‌లో మ్యూజిక‌ల్ హిట్ చిత్రం `పెళ్లి సంద‌డి` మ్యాజిక్ ని తిరిగి నేటి పెళ్లి సంద‌-డితో రిపీట్ చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. అప్ప‌ట్లో ఈ మూవీలో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా న‌టించిన ర‌వళి- దీప్తి భ‌ట్నాగ‌ర్ ల‌ను తెలుగు ఆడియెన్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. అందునా ధీప్తి భ‌ట్నాగ‌ర్ నాటి యూత్ కి వెరీ స్పెష‌ల్. దీప్తి నాభి సొగ‌సును ఆ నాభి దిగువ‌న‌ మ‌చ్చ‌ను కూడా అంత తేలిగ్గా మ‌రువ‌డం క‌ష్టం. ఉత్త‌రాది బ్యూటీ ధీప్తి భ‌ట్నాగ‌ర్ ని అంత అందంగా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కేంద్రుడు. దీప్తి న‌వ్వు ఇస్ట‌యిల్ ప్ర‌తిదీ మ‌ర్చిపోలేరు. ఇక ఈ మూవీకి కీర‌వాణి అందించిన సంగీతం అంతే పెద్ద అస్సెట్ అయ్యింది.

1996లో పెళ్లి సంద‌డి రిలీజైతే ఇప్ప‌టికి శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ హీరోగా అదే టైటిల్ తో రాఘవేంద్ర‌రావు సార‌థ్యంలో పెళ్లి సంద‌-డి తెర‌కెక్కుతోంది. ఇక ఈ మూవీకి ఎంపిక చేసుకున్న బ్యూటీ కూడా దీప్తి భ‌ట్నాగ‌ర్ కి చెల్లెలినే త‌ల‌పిస్తోంది అంటూ కాంప్లిమెంట్లు అందుకుంటోంది. 2021-22 సీజ‌న్ లో రిలీజ్ కి రానున్న ఈ చిత్రం పెళ్లి సంద‌డి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుంద‌నే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సినిమాతో రోష‌న్ లాంటి మ‌రో స్మార్ట్ హీరో టాలీవుడ్ కి ల‌భించిన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు.