ప్రపంచంలోనే మొట్టమొదటి లేడీ హోస్ట్ రాధిక

Thu Nov 14 2019 07:00:01 GMT+0530 (IST)

Radhika is the first lady host in the world

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న షో లు రెండే రెండు. అవి కౌన్ బనేగా కరోడ్ పతి మరియు బిగ్ బాస్. ఈ రెండు కూడా ఇండియాలో చాలా పాపులర్ అయ్యాయి. హిందీ వర్షన్ బాగా నడిచాయి. కాని సౌత్ లో మాత్రం అంతగా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. తమిళంలో నీంగలుయ్ వెల్లాలుమ్ ఒరు కోడీ' పేరుతో కేబీసీ ప్రసారం అయ్యింది. మూడు సీజన్ లను ముగ్గురు విభిన్నమైన హోస్ట్ లు నిర్వహించారు. తెలుగులో కూడా ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో వచ్చింది.తమిళంలో ప్రస్తుతం కేబీసీ లాంటి ఒక షో ను ప్లాన్ చేస్తున్నారు. ఆ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా అమితాబచ్చన్ తమిళంలో ఈ షో ప్రారంభం కాబోతుందంటూ ప్రకటించాడు. కోడీశ్వరి అనే పేరుతో రాధిక హోస్ట్ గా ప్రసారం కాబోతుంది. ఈ షో మొత్తం లేడీస్ కు సంబంధించిందిగా తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి మాదిరిగానే ఈ షో ఉంటుందని తెలుస్తోంది. వారి ఆధ్వర్యంలోనే ఈ షో సాగుతుంది.

ఇక ఈ షోకు హోస్ట్ గా రాధిక వ్యవహరించబోతున్న విషయాన్ని అమితాబచ్చన్ తెలియజేస్తూ.. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో సీజన్ ల కేబీసీ జరిగింది. కాని మొదట మొదటి సారి ఒక లేడీ హోస్ట్ గా వ్యవహరించబోతుందని అమితాబ్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేబీసీకి మొదటి లేడీ హోస్ట్ అంటూ ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ఎన్నో షో లకు లేడీస్ హోస్ట్ లుగా వ్యవహరించారు. కాని మొదటి సారి రాధిక కేబీసీకి హోస్టింగ్ చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి 'కోడీశ్వరి'పై ఉంది. తమిళంలో సక్సెస్ అయితే తెలుగులో కూడా మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.