Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : గడ్డి పీకుతున్న హీరోయిన్‌

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : గడ్డి పీకుతున్న హీరోయిన్‌
X
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన రాధిక ఆప్టే ప్రస్తుతం లండన్‌ లో ఉంది. అక్కడ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులతో చేరువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత ఇంకా రాధిక కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు.

పూర్తి న్యూడ్‌ సన్నివేశాల్లో నటించడం మొదలుకుని.. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వరకు ఎన్నో రకాలుగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సౌత్‌ లో ఒక స్టార్‌ హీరో తన తో అసభ్యంగా మాట్లాడాడు అంటూ విమర్శలు చేసింది. అలాగే సౌత్‌ హీరోల్లో కొందరు హీరోయిన్స్ ను చిన్నచూపు చూస్తారు అంటూ కూడా విమర్శలు చేసింది.

ఎవరు ఎన్ని మాట్లాడినా.. విమర్శలు చేసినా కూడా రాధిక ఆప్టే మాత్రం తన పద్దతిని మార్చుకోలేదు. ఆమె ప్రతి ఒక్క సినిమా సమయంలో కూడా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉండేది. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఈమె గడ్డి పీకుతూ ఫోటోలకు ఫోజు ఇవ్వడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇండియాలో ఆమె స్టార్‌ సెలబ్రెటీ.. అలాంటి రాధిక ఆప్టే అక్కడ గడ్డి పీక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రాధిక ఆప్టే ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే విక్రమ్‌ వేద రీమేక్ లో నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్‌ మరియు హృతిక్‌ రోషన్ నటిస్తున్న విక్రమ్‌ వేద సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌ లో విడుదల కాబోతుంది. అది కాకుండా రాధిక ఆప్టే మోనిక ఓ మై డార్లింగ్‌ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా ఈమెకు మరి కొన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఇటీవల వాటిని తిరష్కరించినట్లుగా తెలుస్తోంది.