రాధేశ్యామ్ ఇంట్రో 24 గంటల్లోనే ఆ ఫీట్

Sun Oct 24 2021 19:03:56 GMT+0530 (IST)

Radheshyam Intro Creates Records

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన  రోజు సందర్భంగా `రాధేశ్యామ్` నుంచి విక్రమాధిత్య ఇంట్రో వీడియోని వదిలిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ టీజర్ సోషల్ మీడియాలో మెరుపు వేగంతో దూసుకుపోయింది. డిజిటల్ మాధ్యమాల్లో  ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ ని సాధించి రికార్డులే సృష్టించింది. ఆకలి మీదున్న ఫ్యాన్స్ కి  బిగ్  ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అంతేనా `అఖండ`..`పుష్ఫ` టీజర్లు సాధించిన రికార్డులు సైతం కొల్లగొట్టింది. టాలీవుడ్ లో 50 మిలియన్ వ్యూస్  సాధించడానికి `అఖండ`కు 16 రోజులు సమయం పట్టగా..`పుష్ప`కు 20  రోజులు పట్టింది.కానీ `రాధేశ్యామ్` ఇంట్రో మాత్రం 24 గంటల్లోనే ఆ ఫీట్ ని సాధించింది. ప్రస్తుతం 62 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఇదే హాయ్యెస్ట్ అని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియాకి చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రభాస్ నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చిన అది  సోషల్ మీడియాలో వాయు వేగంతో దూసుకుపోతుంది. ఇంట్రో వీడియోనే ఈ రేంజ్ లో ఉందంటే..టీజర్ ..ట్రైలర్ రిలీజ్  అయితే ఆ మంటలు ఇంకే స్థాయిలో  ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. దీన్ని బట్టి రాధేశ్యామ్ పై ఎలాంటి అచనాలు నెలకొంటున్నాయో స్పష్టంగా అర్ధమవుతోంది.

భారీ బట్జెట్  తో ఎక్కడా రాజీ లేకుండా చిత్రాన్ని నిర్మించారు. ఇది  1970 లో సాగ్  పిరియాడిక్ చిత్రమని ఇప్పటికే లీక్ అయింది.  రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు..యాక్షన్ సన్నివేశాలు పీక్స్ లోనే ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ అంచనాల్ని  రాధేశ్యామ్ ఎంతవరకూ చేధిస్తుందో చూడాలి.  ఇందులో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది.  `జిల్` ఫేం రాధా కృష్ణ  కుమార్  దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ - టీసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.