Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ విడుదల...!

By:  Tupaki Desk   |   10 July 2020 4:30 AM GMT
ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ - పూజాహెగ్డే లను చూస్తుంటే ముందు నుంచి వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ సినిమా ఒక ఫ్యూర్ లవ్ స్టోరీ గా డిజైన్ చేయబడిందని అర్థం అవుతోంది. 'రాధే శ్యామ్' టైటిల్ చూస్తుంటే ఈ సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రెబర్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్‌, టీ సిరీస్ వారు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక మనోజ్ పరమహంస డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'రాధే శ్యామ్' మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర భాషల నటీనటులు కూడా 'రాధే శ్యామ్' లో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటి భాగ్యశ్రీ, స్టార్ కమెడియన్ ప్రియదర్శి, తమిళ నటుడు సత్యన్, మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్, ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి, బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్, ప్రముఖ నటుడు మురళి శర్మ సహా మరికొందరు ఇతర తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని 2021 లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న మేకర్స్ అనౌన్స్ చేసారు. 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషమైన స్పందన వస్తోంది.