డిజిటల్ రిలీజ్ కాబోతున్న 'రాధే'.. ఎందులో అంటే?

Tue May 04 2021 15:01:15 GMT+0530 (IST)

Radhe Release Date Fixed

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన తన సినిమా రాధే గురించి టెన్షన్ పడుతున్నాడు. కానీ ఇటీవలే ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాధే విడుదల పై సోషల్ మీడియా పరంగా క్లారిటీ ఇచ్చేసాడు. వాస్తవానికి రాధే మూవీ గతేడాది విడుదల కావాల్సింది. కానీ అప్పుడు కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే రాధే మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ 'రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా గురించి ఆ మధ్యలో సినిమా ఖచ్చితంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని స్వయంగా క్లారిటీ ఇచ్చాడు సల్లు భాయ్. కానీ కరోనా వాటన్నిటికీ బ్రేక్ వేసేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ లక్షల సంఖ్యలో జనాలను హాస్పిటల్ పాలుచేస్తోంది. అందుకే సినిమా థియేటర్స్ మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మే నెలలో ఈద్ ఫెస్టివల్ ఉంది. అప్పటికల్లా థియేటర్స్ తెరచుకుంటాయానే గ్యారంటీ లేదు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అవ్వాలంటే కరోనా పోవాల్సిందే. ఇప్పట్లో ఆ వాతావరణం కనిపించడం లేదు. అందుకని సల్మాన్ తాజాగా రాధే మూవీ ఈద్ రోజున డిజిటల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్.. మూవీ మే 13న ఈద్ సందర్బంగా 'జీ ప్లెక్స్'లో 'పే పర్ వాచ్' పద్ధతిలో అందుబాటులోకి రానుంది.

ఇటీవలే సెన్సార్ ముగించుకున్న ఈ యాక్షన్ డ్రామా మూవీ యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అలాగే సినిమా నిడివి కూడా 114 నిముషాలు ఉన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సల్మాన్ కత్రినాతో కలిసి 'టైగర్-3' సినిమా చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం కత్రినా కరోనా బారినపడింది. మరి ఈ లెక్కన ఇప్పట్లో సల్మాన్ సినిమాలు పట్టాలెక్కడం గగనమే. మరి రిలీజ్ కాబోతున్న రాధే సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. చూడాలి మరి ఇలాంటి క్లిష్ట సమయంలో రాధే భాయ్ ఎలా అలరిస్తాడో..!