Begin typing your search above and press return to search.

నోరు జారిన పెద్దాయన.. బూతులు తిడుతున్న నెటిజన్స్‌

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:30 AM GMT
నోరు జారిన పెద్దాయన.. బూతులు తిడుతున్న నెటిజన్స్‌
X
ఇండియన్‌ 2 షూటింగ్‌ సందర్బంగా జరిగిన యాక్సిడెంట్‌ లో ముగ్గురు మరణించిన విషయం తెల్సిందే. ఆ విషయం తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. శంకర్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు సౌత్‌ ఆడియన్స్‌ ను మాత్రమే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించాయి. అందుకే శంకర్‌ సినిమా గురించిన వార్త అవ్వడంతో అందరు కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇండియన్‌ 2 ప్రమాదం గురించి జాతీయ స్థాయి మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అందులో ఎవరు కూడా శంకర్‌ తప్పును ఎత్తి చూపలేదు. షూటింగ్‌ లో ప్రమాదాలు జరుగుతుంటాయి.. అయితే ఇలా ముగ్గురు మరణించడం దురదృష్టకరం అంటూ చాలా మంది అన్నారు.

అందరు ఒకలా ఆలోచిస్తే తాను మరోలా అన్నట్లుగా ఉండే రాధా రవి దర్శకుడు శంకర్‌ పై విమర్శలు గుప్పించాడు. హాలీవుడ్‌ స్థాయి లో సినిమాలు తీయడం కాదు.. సెట్స్‌ లో ఉండే టెక్నీషియన్స్‌ ను జాగ్రత్త గా చూసుకోవడం ముఖ్యం. సినిమాలు అందరు చేస్తారు.. ఎలాంటి ప్రమాదం జరుగకుండా తీసిన వాడే గొప్ప దర్శకుడు అన్నట్లుగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంలో రాధా రవి వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్స్‌ ట్రోల్స్‌ అవుతున్నాయి.

గతంలో నయనతార గురించి మాట్లాడి విమర్శల పాలయిన ఈయన ఇప్పుడు దర్శకుడు శంకర్‌ ను చిన్నతనపు మాట అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దర్శకుడు క్రేను ఆపరేట్‌ చేస్తాడా లేదంటే.. సినిమాను తీస్తాడా. కనీసం పరిజ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు. తమిళ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకుడు శంకర్‌. ఆయన షూటింగ్‌ లో ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమే అయినా ఆయన్ను తగ్గించి మాట్లాడటం కరెక్ట్‌ కాదు. అలాంటి వ్యాఖ్యలు చేసి నీ స్థాయిని దిగజార్చుకున్నావు అంటూ నెటిజన్స్‌ రాధారవిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.