నా పిల్లలకు 20 ఏళ్లు వచ్చాక నాకు 60 ఏళ్లు వస్తాయి!

Sat Dec 10 2022 09:01:13 GMT+0530 (India Standard Time)

Rabir Kapoor About His Children and Life

రణబీర్ కపూర్-ఆలియా జంట అన్యోన్య దాంపత్యం అభిమానుల్లో నిరంతరం చర్చకు వస్తోంది. ఈ జంట ఇప్పటికే తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. గత నెలలో తండ్రి అయిన రణబీర్ కపూర్ ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరై తన సినిమాలు పేరెంటింగ్ హుడ్ సహ చాలా విషయాలను స్థానిక మీడియాతో మాట్లాడాడు.బ్రూట్ ఇండియా భాగస్వామ్యంలోని ఈ ఉత్సవాల్లో 40 ఏళ్ల రణబీర్ తన ''అతిపెద్ద అభద్రత'' గురించి మీడియాతో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. తండ్రి అయిన తర్వాత మీలో మార్పు గురించి చెప్పండి? అని మీడియా ప్రశ్నించగా.. రణబీర్ కపూర్ ఇలా అన్నాడు. ''నేను పెళ్లి కోసం ఎందుకు ఇంత సమయం తీసుకున్నానో అని ఆశ్చర్యపోతున్నాను.

నా అతిపెద్ద అభద్రత ఏమిటంటే నా పిల్లలు 20 లేదా 21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నాకు 60 సంవత్సరాలు వస్తాయి. ఓల్డ్ మ్యాన్ గా నేను వారితో ఫుట్ బాల్ ఆడగలనా? నేను వారితో పరుగెత్తగలనా?'' అని ప్రాక్టికాలిటీపై మాట్లాడాడు.

రణబీర్ తన సతీమణి అలియా భట్ తో వృత్తిగత పోటీ గురించి.. పిల్లలు పుట్టాక మారిన పని విధానం గురించి మాట్లాడాడు.''నేను 180-200 రోజులు మించి సంవత్సరంలో ఎక్కువ పని చేయను. ఆమె (ఆలియా భట్) చాలా ఎక్కువ పని చేస్తుంది. మరింత బిజీగా ఉంటుంది. కానీ మేం  దీనిని బ్యాలెన్స్ చేస్తాం. ఆలియా పని చేస్తున్నప్పుడు నేను విరామం తీసుకుంటాను లేదా నేను నా పని కోసం బయటకు వచ్చినప్పుడు ఆమె విరామం తీసుకుంటుంది'' అని తెలిపాడు.

అలియా భట్ - రణబీర్ కపూర్ నవంబర్ 6న ఒక అందమైన చిన్నారిని తమ జీవితంలోకి స్వాగతించారు. తనకు 'రాహా' అని పేరు పెట్టారు. ఈ పేరు రణబీర్ తల్లి ప్రముఖ నటి నీతూ కపూర్ ఎంపిక. రణబీర్ కపూర్ -అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ లో కపూర్ ల స్వగృహం 'వాస్తు'లో కొద్దిమంది బంధుమిత్రులు కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అలియా భట్ -రణబీర్ కపూర్ జంట నడుమ అసలైన ప్రేమకథ అయాన్ ముఖర్జీ చిత్రం 'బ్రహ్మాస్త్ర' సెట్స్ లో ప్రారంభమైంది. ఈ మూవీ బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రణబీర్ కపూర్ తదుపరి సందీప్ రెడ్డి వంగా  యానిమల్ లో నటిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ తో కలిసి లవ్ రంజన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ లో కూడా కనిపించనున్నాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.