Begin typing your search above and press return to search.
మెల్లిగా ఎలాగోలా దీపిక వెంట పడుతోందా?
By: Tupaki Desk | 28 May 2023 5:00 AMఇక్కడ మెల్లిగా ఎలాగోలా బతికేయడానికి రాలేదు! ఈ ముంబైని ఉ** పోయించడానికి వచ్చానని అంటాడు బిజినెస్ మేన్ మహేష్. చూస్తుంటే రాశీఖన్నా తీరు తెన్నులు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. ఈ భామ మెల్లిగా ఏదోలా బతికేసేందుకు సిద్ధంగా లేదు. ఫ్యామిలీమ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజ్ అండ్ డీకేలకు చేరువైన రాశీఖన్నా ఎంతో తెలివిగా ఫర్జీ సిరీస్ కి కమిటైంది. ఆ ఒక్క వెబ్ సిరీస్ తో రాశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అంతకుముందెన్నడూ ఇంతగా కితాబులు అందుకోలేదు.
అందుకే ఇదే అదనుగా తన హవా ఏంటో చూపించాలనుకుంటోంది. ఇతర స్టార్ హీరోయిన్ల వెంటపడి నెమ్మదిగా రేసులో ఒక్కో మెట్టు పైకి ఎక్కాలని ఆలోచిస్తోంది. అనుకున్నదే తడవుగా ఇతర స్టార్ హీరోయిన్లతో పోటీపడుతూ బ్రాండ్లలోను దూసుకుపోతోంది.
మ్యాన్‌కైండ్ ఫార్మా హౌస్ నుండి యాంటీ ఇన్ ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ జెల్ & ఫేస్ వాష్ అయిన AcneStar కి రాశీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ప్రేక్షకులతో మెరుగ్గా ఎంగేజ్ చేయడానికి సదరు బ్రాండ్ కొత్త ముఖంగా బహుభాషా ప్రతిభావంతులైన రాశి ఖన్నాను ఎంపిక చేసుకుంది. రాశి ఖన్నా తన సినిమాలతో విభిన్న భాషలు- మాధ్యమాలు- కళా ప్రక్రియల ద్వారా స్పెక్ట్రమ్ అంతటా ప్రజాదరణ పొందినందున బ్రాండ్ కి మల్టీ ట్యాలెంటెడ్ గాళ్ తో ప్రచారాన్ని కోరుకుంది.
TVCతో పాన్ ఇండియా లెవల్లో మరింత విస్తృత ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాశి ఖన్నా తన OTT షోలు రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ - ఫర్జితో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సృష్టించింది. ప్రస్తుతం యోధ లాంటి భారీ చిత్రం కోసం ధర్మ హీరోయిన్ గాను మారింది. దేశ విదేశాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న దీపిక పదుకొనే ఓవైపు బ్రాండ్స్ లో అగ్రనాయికగా దూసుకుపోతుంటే ఇప్పుడు యువనటి రాశీఖన్నా తనను అనసరించడం ఆసక్తికరం.
టాప్ అంబాసిడర్ దీపిక..
ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ కి సంతకం చేసిన మొదటి భారతీయురాలిగా దీపికా పదుకొనే పేరు ఇటీవల మార్మోగుతోంది. లూయిస్ వీట్టన్ తర్వాత వజ్రాభరణాల సంస్థ కార్టియర్ కి సంతకం చేసింది. కార్టియర్ ఆభరణాలకు అతిపెద్ద ప్రపంచ రాయబారిగా దీపిక మారింది.
గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ లకు దీపిక సంతకం చేయడం ఇతర నటీనటులకు తలుపులు తెరిచి మార్గం చూపడమేనని భావించాలి. హాలీవుడ్ అరంగేట్రం సహా MET గాలాకు హాజరు కావడం వరకు.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గా ఉండటం నుంచి దీపికా అంతర్జాతీయంగా FIFA ట్రోఫీని ఆవిష్కరించడం వరకూ ప్రతిదీ ఆసక్తికరం. దీపికా పదుకొనే చివరిసారిగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పఠాన్‌లో కనిపించింది. ఇందులో షారుఖ్ ఖాన్ - జాన్ అబ్రహంతో కలిసి గూఢచారి పాత్రను పోషించింది. తదుపరి హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ లో నటించనుంది. ఈ చిత్రం పైలట్ ల జీవితం నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఏరియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అనిల్ కపూర్- కరణ్ సింగ్ గ్రోవర్- అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. మరోవైపు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే లోను దీపిక నటిస్తోంది.