Begin typing your search above and press return to search.

ఆ బొద్దుగుమ్మ దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా...?

By:  Tupaki Desk   |   23 April 2020 12:30 AM GMT
ఆ బొద్దుగుమ్మ దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా...?
X
సినీ పరిశ్రమకి రోజుకొక కొత్త హీరోయిన్ పరిచయమవుతూ ఉంటారు. వారిలో కొందరు అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా.. మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోతుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేల్ డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో హీరోలు శాశ్వితంగా ఉంటారేమో.. హీరోయిన్స్ మాత్రం ఏదొక రోజు ఇంటికి వెళ్లిపోవాల్సిందే అనే సత్యం అందరికి తెలిసిందే. కొంతమంది హీరోయిన్స్ కొన్ని రోజులు స్టార్ హీరోయిన్ గా వెలుగొందినప్పటికీ ఒక్క సినిమా ప్లాప్ అయితే కిందికి దించేస్తారు మన ఇండస్ట్రీ వాళ్ళు. అంతేకాకుండా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లు దుకాణం సర్దేసే టైం కూడా వస్తుంటుంది. ఎందుకంటే 'కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవాల్సిందేగా'.. మన సినీ ఇండస్ట్రీలో విషయంలో కూడా సినిమా హిట్ కొట్టినా ఫ్లాప్ అయినా కొత్త అందాల రాక‌తో ఇక పాత అందాలు స‌ర్ధుకోవాల్సిందే.

అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఈ బ్యాచ్ లో మొట్ట మొద‌ట ప్యాక‌ప్ చెప్పాల్సిన బ్యూటీ రాశీ ఖ‌న్నా అంటున్నారు సినిమా జ‌నాలు. 'ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఆ తర్వాత గోపిచంద్‌ తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా గతేడాది 'వెంకీ మామ' 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది. అయినా ఏం లాభం ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తమిళంలో 'సైతాన్ కా బచ్చా' అనే సినిమా ఒప్పుకున్నప్పటికీ అది ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి.

యాక్టింగ్ అంటూ గ్లామ‌ర్ షో ని రాశీ ప‌క్క‌న పెట్టేయ‌డంతో ఈ బ్యూటీ కి ఉన్న క్రేజ్ కూడా బాగా త‌గ్గిపోయింద‌ని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. అలానే ఈ బ్యూటీ సెలెక్ట్ చేసుకొని మరీ న‌టించిన యూత్ ఫుల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' కూడా డ‌బుల్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో తెలుగులో రాశీకి సినిమా క‌ష్టాలు వచ్చాయంటున్నారు. దీంతో ఇక ఇక్కడ లాభం లేదనుకొని ఈ బ్యూటీ క‌న్న‌డ సీమ వైపు చూస్తోంద‌ట. అక్క‌డ స్టార్ హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్స్ కోసం రాశీ అండ్ టీమ్ తెగ ట్రై చేస్తున్నారట. మరి బొద్దుగుమ్మ రాశీఖన్నాకి రాబోయే రోజుల్లో ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి.