ఫోటో స్టోరి: రత్తాలు ఎర్రగులాబీ వేషం

Fri May 07 2021 21:00:01 GMT+0530 (IST)

 Raai Laxmi Latest Stunning Pose

రత్తాలు ఏం చేసినా సంథింగ్ స్పైసీగానే ఉంటుంది. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు అంటూ యూత్ వెంటపడేంత క్రేజు అందుకే. రాయ్ లక్ష్మీ అని పిలిచినా రత్తాలు అని పిలిచినా నేనున్నానని పలుకుతుంది. అన్నట్టు రత్తాలు ఇటీవల వరుసగా సినిమాలకు సంతకాలు చేసింది కానీ అవి ఎందుకని రిలీజ్ కావడం లేదో సరైన సమాధానం లేదు.కానీ క్రైసిస్ వేళ..  ఈ ఖాళీ సమయాన్ని తెలివిగా సోషల్ మీడియా ఆర్జన కోసం ఉపయోగిస్తోంది. తనని అభిమానులు మర్చిపోకుండా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. రాయ్ లక్ష్మీ ఇన్ స్టా వేదికగా వీటిని షేర్ చేస్తూ భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. అలాగే ఈ వేదికలపై వాణిజ్య ప్రకటనల్ని పోస్ట్ చేస్తూ లక్షల్లో రెవెన్యూ అందుకుంటోంది. తాజాగా రాయ్ లక్ష్మీ ఎర్ర గులాబీ లుక్ గుబులు రేపుతోంది. ఇది ఓ బీచ్ రిసార్ట్ కం విల్లాలో ఫోటోషూట్ అని అర్థమవుతోంది.

రాయ్ లక్ష్మి తన కెరీర్ లో.. తమిళం -మలయాళం- తెలుగు- కన్నడ- హిందీ వంటి పలు భాషల్లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది. చిత్ర పరిశ్రమలో 14 సంవత్సరాలు పూర్తి చేసింది. 5 మే 1989న కర్ణాటక- బెల్గాంలో రామ్ రాయ్ బాగి - మంజుల రాయ్ బాగి దంపతులకు జన్మించింది. లక్ష్మీ రాయ్ 2005 లో `కర్కా కసదార` పాత్ర(తమిళం)తో కేవలం 15 ఏళ్ళ వయసులో సినీరంగ ప్రవేశం చేశారు.

అటుపై `క్రిస్టియన్ బ్రదర్స్` చిత్రంలో నటించింది. ఇది భారీగా కమర్షియల్ విజయం సాధించింది. ఆమె బాలీవుడ్ చిత్రం `ఆఫీసర్ అర్జున్ సింగ్ ఐపిఎస్ బ్యాచ్ 2000`లో కూడా నటించింది. ఆ తర్వాత తమిళం.. తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో కొన్ని అవకాశాలు అందుకుంది.