రత్తాలూ ఏమిటిలా గుర్తు పట్టలేనంతగా..

Mon Jul 13 2020 11:45:49 GMT+0530 (IST)

Raai Lakshmi Shocking Makeover

``రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు!`` అంటూ మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే టెంప్టయిపోయారు మరి. రత్తాలు అందంలో అంత కిక్కుంది. ఆరు నుంచి 60వరకూ ఏజ్ తో పని లేకుండా టెంప్ట్ చేయడంలో రత్తాలు సక్సెసైంది. ఐటెమ్ భామగా కిక్కు పెంచాక మళ్లీ రత్తాలు కెరీర్ జరంత స్పీడ్ గానే ముందుకు సాగింది. కానీ కాలక్రమంలో ఏమైందో కానీ రత్తాలు రేసులో వెనకబడిపోయింది.``ఊరికే తిని కూకుంటే మడిషికి గొడ్డుకి తేడా ఏటుంటాది`` అనుకుందో ఏమో!! ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో ఫోటోషూట్లతో రెగ్యులర్ గా ఝడిపించేస్తోంది. అసలే జీరోసైజ్ పిచ్చి పీక్స్ కి చేరుకోవడంతో రత్తాలు రూపం మొత్తం మారిపోయింది. అయినా ఏదో తెగువ.. ఇంకేదో ప్రయత్నం చేస్తోందిలా. రత్తాలా మజాకానా?  పట్టువదలని విక్రమార్కుడి సోదరిలా ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో చేయని ప్రయత్నం లేదు.  

కెరీర్ ఆరంభం ఎం.ఎస్.ధోనీతో ఎఫైర్ వల్ల మైలేజ్ పెరిగింది. కొన్నేళ్లు సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ తర్వాత మెగాస్టార్ ఆఫర్ తో కొంతవరకూ ఇంప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పుడు తనని ఆదుకునేదెవరు?  రాయ్ లక్ష్మీ ఇక ఇంతేనా?  ప్రస్తుతం ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటిస్తున్నా అవేవీ రిలీజ్ కి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. బాలీవుడ్ లో `ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000` అనే చిత్రంలో ఐటెమ్ నంబర్ లో ఆడిపాడుతోంది. అలాగే ఝాన్సీ- సిండ్రెల్లా- ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.