Begin typing your search above and press return to search.

RRR ట్రైలర్: బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న..!

By:  Tupaki Desk   |   29 Nov 2021 11:19 AM GMT
RRR ట్రైలర్: బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న..!
X
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ట్రైలర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.

RRR ట్రైలర్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామని రాజమౌళి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 3వ తేదీన ట్రైలర్ ను ఆవిష్కరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 'బిగ్గెస్ట్ బ్లాస్ట్ కోసం సిద్ధంగా ఉండండి. ప్రశాంతత లేదు.. ఇక సెలబ్రేషన్స్ ప్రారంభించండి' అని పేర్కొంటూ మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అజయ్ దేవగన్ - అలియా భట్ లతో కూడిన 'ఆర్.ఆర్.ఆర్' పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నలుగురూ ఎమోషనల్ గా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు - మూడు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ఆత్మగా పేర్కొంటున్న 'జనని' గీతం భావోద్వేగానికి గురి చేసింది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ట్రైలర్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో చూడాలి.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చెర్రీ కి జోడీగా ఆలియా భట్‌ - తారక్ సరసన ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR మూవీ విడుదల కానుంది.