శంకర్ నూ వెయిటింగ్ లో పెట్టిన 'ఆర్‌ఆర్‌ఆర్'

Wed Jun 09 2021 15:00:44 GMT+0530 (IST)

RRR puts Shankar in waiting list

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కరోనా మొదటి వేవ్ సెకండ్ వేవ్ కారణంగా ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ మరో రెండు నెలలు బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇతర సినిమాలు అన్ని కూడా పక్కన పెట్టారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తి అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఆ వెంటనే త్రివిక్రమ్ మరియు ప్రశాంత్ సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సమయంలోనే ఆచార్య లో చిన్న గెస్ట్ రోల్ చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు.దిల్ రాజు బ్యానర్ లో శంకర్.. రామ్ చరణ్ ల మూవీ జులై లో మొదలు కాబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబో మూవీ ఆలస్యం అయ్యేలా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు చరణ్ మరే సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదంటున్నారు. అందుకే చరణ్ ఆర్ఆర్‌ఆర్ సినిమా చిత్రీకరణ ముగించుకునే వరకు కూడా శంకర్ వెయిట్ చేయాల్సి వస్తుందట.

ఇండియన్ 2 సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమా కోసం ఏడాది పాటు వెయిట్ చేసిన శంకర్ మరి కొన్నాళ్ల పాటు ఆర్ఆర్‌ఆర్ సినిమా వల్ల వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది చివరి వరకు రామ్ చరణ్ తో శంకర్ మూవీ మొదలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమా విడుదల కోసం 2023 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.