Begin typing your search above and press return to search.

RC ట్రోఫీతో ఉత్త‌రాంధ్రలో RRR ప్ర‌చారం

By:  Tupaki Desk   |   29 Nov 2021 4:30 PM GMT
RC ట్రోఫీతో ఉత్త‌రాంధ్రలో RRR ప్ర‌చారం
X
రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి రాజ‌మౌళి టీమ్ భారీ ప్ర‌చారానికి తెర తీయ‌నుంది. ఇంత‌కుముందు చ‌ర‌ణ్ అభిమానులు ఉత్త‌రాంధ్ర‌లో డిఫ‌రెంట్ గా ప్ర‌మోష‌న్ ని ప్రారంభించారు.

మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు.. స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుంటారు. ఇటీవ‌ల సెకండ్ వేవ్ స‌మ‌యంలో రోగుల‌కు ఆక్సిజ‌న్ సేవ‌ల్ని చేశారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ను త‌లకెత్తుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ - 2021 పేరుతో క్లాసికల్ డాన్స్ - వెస్టర్న్ డాన్స్- పాటల పోటీలు- సోలో యాక్టింగ్- షార్ట్ ఫిలిం మేకింగ్ - బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9-10-11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియం లో సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ రోజు వైజాగ్ VJF ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్ ని ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ చేతుల మీదుగా ప్రారంభించగా రాంచరణ్ ట్రోఫీని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ- మెగా అభిమానులు & ఆర్గనైజర్లు సమక్షంలో ట్రోఫీని ప్రారంభించారు. ఈ రాంచరణ్ ట్రోఫీ పోటీలలో ఆరు విభాగాల్లో గెలిచిన ఫైనల్స్ విజేతలకు 19 - 12 -2021వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఏరీనా ఆడిటోరియం లో ప్రముఖ అతిథుల చేతుల మీదుగా కాష్ ప్రైజ్ సహాయ ట్రోఫీ బహుకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం ధనుంజయ ఛానల్ నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర చిరంజీవి యువత భవాని అధ్యక్షులు రవి కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.