కేజీఎఫ్ 2 కలెక్షన్లు దాటేసిన ఆర్ఆర్ఆర్

Fri Mar 17 2023 13:19:14 GMT+0530 (India Standard Time)

RRR Movie Crossed KGF 2 Collections

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం ఈ సినిమా నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ దక్కించుకోవడమే. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. అదేమిటంటే గత ఏడాది విడుదలైన ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్స్ విషయంలో కేజిఎఫ్ 2 కంటే వెనకబడి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1152 కోట్ల 40 లక్షల గ్రాస్ సాధించింది. అయితే అదే సమయంలో కేజీఎఫ్ 2 సినిమా 1233 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా కంటే ప్రశాంత్ నీల్ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.

అయితే ఆసక్తికరంగా ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన నేపథ్యంలో దాదాపు 81 కోట్ల 60 లక్షల గ్రాస్ సాధించినట్లుగా చెబుతున్నారు. దానికి తోడు ఈ మధ్యనే ఆస్కార్కి ముందుగా మార్చి 10వ తేదీన సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని కొన్ని లొకేషన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయగా దాదాపు రెండున్నర కోట్లు కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఆ సినిమా చివరికి 1236 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కేజీఎఫ్ 2 సినిమా కలెక్షన్లు దాటేసి 2022వ సంవత్సరంలో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్గా రికార్డులకు ఎక్కింది.
 
జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి గుర్తింపు దక్కినట్లయింది.

దీంతో రాజమౌళి తెరకెక్కించబోయే తరువాతి సినిమాలతో పాటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడతారని అంచనాలు వెలువడుతున్నాయి. చూడాలి ఎంతవరకు నిజమవుతుంది. ఎంతవరకు ఆస్కార్ మనవాళ్లకు కలిసి రాబోతుంది అనేది.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.