మరో దేశంలో మన రామరాజు కొమురం భీమ్

Sun Jun 26 2022 20:00:01 GMT+0530 (IST)

RRR In South Korea

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఖండాంతరాలు దాటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తెలుగు లో రూపొందిన ఒక సినిమా పదుల దేశాల్లో ప్రస్తుతం అక్కడి ప్రేక్షకులకు నచ్చింది అంటే రాజమౌళి ఏ స్థాయిలో సినిమా ను తెరకెక్కించాడో అర్థం చేసుకోవచ్చు. హీరోలు ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్నారు.థియేట్రికల్ రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా దేశ విదేశాలను చుట్టేస్తుంది. ఇండియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను జీ 5 లో స్ట్రీమింగ్ చేస్తూ ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇ

ఇప్పటికే పదుల దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఆయా దేశాల భాషల్లో సబ్ టైటిల్స్ వేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా ఆర్ ఆర్ ఆర్ ను నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అక్కడ ప్రేక్షకుల కోసం కొరియన్ సబ్ టైటిల్స్ వేసి మరీ రామరాజు మరియు కొమురం భీమ్ లను అక్కడకు తీసుకు వెళ్లినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటించి మెప్పించాడు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు మ్యూజికల్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. సినిమా లోని విజువల్స్ మరియు ఎమోషన్స్ అద్బుతంగా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి.