ఆస్కార్ పై జక్కన్న ఖర్చు.. వెనక్కి వచ్చేలా పెట్టుబడి!

Sat Mar 18 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

RRR In Oscars

ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటారు. ఈ సినిమా అనేక రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు. రూ.1200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన విషయం కూడా అందరికీ విధితమే. అయితే ఆస్కార్ కు ఎంపికైన తర్వాత దాని కోసం డైరెక్టర్ రాజమౌళి 80 కోట్లు ఖర్చు చేశాడంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి.స్టార్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ అయితే అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ పెడుతున్న ఖర్చుతో ఏకంగా 8 సినిమాలు తీయొచ్చని అన్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆయన కామెంట్లకు వ్యతిరేకంగా కొందరు సమర్థిస్తూ మరికొంత మంది అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ రేంజ్ లో ఖర్చు పెట్టడం అవసరమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడానికి ఓ కారణం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదంతా ఒక విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పెట్టుబడి అని చెప్పొచ్చు అంటూ వివరిస్తున్నారు. మహేష్ సినిమా కోసం హాలీవుడ్ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేలా చేసేందుకే రాజమౌళి ఆ స్థాయిలో ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మహేష్ సినిమాకు ఇది ఉపయోగపడితే.. రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్ బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ జక్కన్న వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మహేష్ సినిమా ద్వారా 80 కోట్లకు మూడింతలూ వసూలు చేయొచ్చని అంటున్నారు. పది రూపాయలు వచ్చేలా ఉంటేనే ఓ రూపాయి ఖర్చు చేస్తారంటూ వివరిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో. అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న అడ్వెంచర్ కథ కాగా.. ఈ జోనర్ లో సినిమా చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నట్లు చెప్పారు. ఇండియానా జోన్స్ తనకు ఎంతో ఇష్టమైన సినిమా అని రాజమౌళి చెప్పారు.