Begin typing your search above and press return to search.

అప్పట్లో RRR.. వివాహ భోజనంలో సీనియర్ ఎన్టీఆర్... వీడియోలు వైరల్

By:  Tupaki Desk   |   30 May 2023 4:19 PM GMT
అప్పట్లో RRR.. వివాహ భోజనంలో సీనియర్ ఎన్టీఆర్... వీడియోలు వైరల్
X
కళామతల్లి ముద్దు బిడ్డ, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇటీవల శత జయంతి ఉత్సవాలను కుటుంబసభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది, ఆ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ఆ వీడియోలో RRR పేరిట ముగ్గురు దిగ్గజాలు ఒకేసారి కనిపించడం విశేషం. ఈరోజుల్లో ట్రిపుల్ ఆర్ అనగానే ఎవరికైనా రామారావు,రామ్ చరణ్, రాజమౌళి గుర్తుకువస్తారరు. కానీ ఆ కాలంలోనూ ఇలాంటి ముగ్గురు దిగ్గజాలు ఉన్నారు. వారే రామారావు, రామా నాయుడు, రాఘవేంద్రరావు. ఈ ముగ్గురూ కలిసి ఓ వివాహ భోజనం కలిసి చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో మొదట కారు కనపడింది. ఆ కారులో సీనియర్ ఎన్టీఆర్ కాషాయ రంగు దుస్తులో ఉన్నారు. ఆయన కారు దిగి ఓ వివాహానికి వచ్చారు. ఆయన రావడంతో ఆయనను చూడటానికి అందరూ గుమ్మిగూడటం విశేషం. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం వివాహ భోజనానికి కూర్చున్నారు. ఆయన పక్కన రామా నాయుడు, ఆయన పక్కనే డైరెక్టర్ రాఘేవంద్రరావు కూర్చోవడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి రాఘేవంద్రరావు కంట పడింది.

ఆయన ఆ వీడియో షేర్ చేసిన వారికి థ్యాంక్స్ తెలియజేశారు. తమ ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ అంటూ ఆయన క్యాప్షన్ కూడా ఇవ్వడం విశేషం. ఆ ముగ్గురిలో సీనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో కాగా, రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్, ఇక రామానాయుడు స్టార్ నిర్మాత కావడం విశేషం. వారి ముగ్గురు మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ వీడియోలో కనిపిచడం విశేషం. వీరి ముగ్గురిలో ఎన్టీఆర్, రామానాయుడు స్వర్గస్తులయ్యారు. ఇక ఈ వీడియోకి నెటిజన్ల నుంచి రియాక్షన్ కూడా అదిరిపోయింది. ముగ్గురూ గ్రేట్ లెజెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.