Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా బాబాయి అబ్బాయి పాటలే

By:  Tupaki Desk   |   16 Jan 2022 1:37 PM GMT
ఎక్కడ చూసినా బాబాయి అబ్బాయి పాటలే
X
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి ఉత్సవాల తాలూకు హడావుడి మూడు రోజుల పాటు కొనసాగింది. సంక్రాంతి సంబరాలు ఆరంభం అయినది మొదలుకుని ముగిసే వరకు మెగా బాబాయి అబ్బాయిలు అయిన పవన్ కళ్యాణ్ మరియు రామ్‌ చరణ్ ల పాటలు మారు మ్రోగుతూనే ఉన్నాయి. కోళ్ల పందేళ అడ్డాల వద్ద మరియు డాన్స్ షో లు స్టేజ్‌ షో లు ఇతర పండుగ సెలబ్రేషన్స్ వద్ద ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ పాటలు కుమ్మేశాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ మరియు డీజే వర్షన్‌ లకు డాన్స్ లు తెగ వేశారు. ఇక రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన నాటు నాటు పాట మరో రేంజ్ లో ఎంటర్‌ టైన్ చేయడం జరిగింది.

భీమ్లా నాయక్‌ పాటలు మరియు నాటు నాటు సాంగ్ ఈ సంక్రాంతి పండుగ సందర్బంగా కొన్ని లక్షల మంది ప్లే చేయడం జరిగింది. మొత్తానికి సినిమా లు రెండు సంక్రాంతికి విడుదల కాకున్నా వాటి పాటల హడావుడి మాత్రం జోరుగా కనిపించింది. ఈ రెండు పాటల తర్వాత అంతే స్థాయిలో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలోని పాటలు కూడా ప్రతి చోట సందడి చేశాయి. భారీ ఎత్తున వ్యూస్ ను దక్కించుకున్న పుష్ప ఐటెం సాంగ్‌ ఊ అంటావా ఊఊ అంటావా పాట సంక్రాంతికి కూడా కుమ్మేసింది. ప్రతి గ్రామంలో ప్రతి పండుగ సెలబ్రేషన్‌ స్టేజీ వద్ద ఈ పాటలు మారు మ్రోగాయి అనడంలో సందేహం లేదు.

రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఏ స్థాయిలో అయితే నాటు నాటు కు డాన్స్ వేసి ఆకట్టుకున్నారో అదే రేంజ్ లో చాలా మంది డాన్స్ వేసి రీల్స్ చేయడం.. షార్ట్‌ వీడియో లు చేయడం జరిగింది. ఈ పండుగ సందర్బంగా అలా రీల్స్ చేసిన వారు కూడా లక్షల మంది ఉన్నారు. నాటు నాటు తో పాటు పుష్ప సాంగ్స్ మరియు భీమ్లా నాయక్ సాంగ్స్ కూడా రీల్స్ మరియు షార్ట్‌ వీడియోలు చేసేందుకు తెగ వినియోగించినట్లుగా సోషల్ మీడియా పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి ఈ మూడు సినిమాల పాటలు కుమ్మేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూడు సినిమాల్లో పుష్ప విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మిగిలిన రెండు సినిమాల పాటలు ఇంతగా పాపులర్ అవ్వడంతో సినిమాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.