Begin typing your search above and press return to search.

ఆర్. పి ప‌ట్నాయ‌క్ సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో?

By:  Tupaki Desk   |   30 May 2023 11:06 AM GMT
ఆర్. పి ప‌ట్నాయ‌క్ సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో?
X
ఆర్ . పి ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సి న పనిలేదు. దాదాపు రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణం లో ఎన్నో మ్యూజిక‌ల్ హిట్స్ అందించారు. మ‌రెన్నో క్లాస్..మాస్ బీట్స్ తో శ్రోత‌ల్సి అల‌రించారు. సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. 'నీకోసం' నుంచి 'మ‌న‌లో ఒక‌డు' వ‌ర‌కూ ఆర్ పీ ట్యూన్ వినిపిస్తూనే ఉంది. అయితే ఐదారేళ్ల‌గా ఆర్ . పీ సంగీతానికి దూరంగా ఉన్నారు. అలాగ‌ని మ‌ళ్లీ ద‌ర్శ‌కుడిగానో..న‌టుడిగానో బిజీ అవ్వ‌లేదు. సంగీతానికి త‌న‌కు తానుగానే విరామం ఇచ్చారు. ఈ విరామం త‌న‌కు తానుగానే తీసుకున్నారా? లేక అవ‌కాశాలు లేక ఖాళీగా ఉన్నారా? అని ర‌క‌ర‌కాల సందేహాలుండేవి.

తాజాగా మ‌ళ్లీ 'అహింస' సినిమాతో కంబ్యాక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా తో ఆర్ పీ మ‌ళ్లీ త‌న ట్యూన్ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా రిలీజ్ నేప‌థ్యంలో ఆర్ పీ ప‌లు విష‌యాలు పంచుకున్నారు.

ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. సంగీతం చేయ‌మ‌ని చాలా మంది అవ‌కాశాలిచ్చారు. కానీ చేయాల‌నిపించ‌లేదు. ఏదైనా క‌థ‌న‌చ్చితేనే చేస్తాను. లేక‌పోతే చేయాల‌నిపించ‌దు. కానీ నా చేతిలో సినిమా ఉన్నా... లేక‌పోయినా రోజు 18 గంట‌లు ప‌ని చేయ‌డం అల‌వాటు.

ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో కొన్ని సినిమాలు చేస్తున్నా. ద‌ర్శ‌కుడి క‌థ‌లు సిద్దం చేస్తున్నా. నేను ఎన్ని చేసినా సంగీత‌మే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. అంతా న‌న్ను సంగీత ద‌ర్శ‌కుడిగానే చూస్తారు.

ఓ సంద‌ర్భంలో మ‌ళ్లీ సంగీతం చేయ‌న‌ని చెప్పి మానేసాను. కానీ ఓ సంద‌ర్భంలో బాలుగారు మ‌ళ్లీ సంగీతం ఎప్పుడు మొద‌లు పెడుతున్నావ్ అని అడిగారు. ఆయ‌న‌కు చేస్తాను గురువు గారు అని చెప్పేవాడిని.

ఆయ‌న వెళ్లిపోయాక ఆయ‌న‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక‌పోయాను అనిపించింది. బాలు పాట‌పై ఉన్న అభిమానంతో సినిమాల్లోకి వ‌చ్చా. ఈ నేప‌థ్యంలో తేజ గారిని క‌లిసాక మ‌ళ్లీ సంగీతం చేయాలి. అది బాలు గారి కోరిక అని చెప్పా. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి తేజ ఫోన్ చేసి 'చిత్రం-2' చేస్తున్నామ‌ని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ స్థానంలోనే 'అహింస' వ‌చ్చింది. క‌థ‌కు త‌గ్గ‌ట్టు మంచి పాట‌లు కుదిరాయి. అహింస సిద్దాంతాన్ని న‌మ్మే ఓ అబ్బాయి క‌థ ఇది' అని అన్నారు.