నెట్టింట వర్మని ఆడుకుంటున్న నెటిజన్స్

Thu Dec 09 2021 07:00:01 GMT+0530 (IST)

RGV bold comments on love and Romance

`శివ` సినిమాతో తనదైన మేకింగ్ టేకింగ్ తో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు రామ్ గోపాల్ వర్మ. ఇది గతం ఇప్పుడ వర్మ అంటే ఓ కాంట్రవర్సీ.. లేదా ఓ పనికి మాలిన సినిమాల దర్శకుడు అనే ముద్ర పడిపోయింది. దర్శకుడిగా తన క్రేజ్ తగ్గినా నిత్యం వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలవడం వర్మ ప్రత్యేకత.అదే ఆయనని ఇంకా రిటైర్‌మెంట్ లేకుండా లైమ్ లైట్‌లో వుండేలా చేస్తోంది. తన ఏజ్ గ్రూప్ దర్శకులు ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించేసి ఇంటికే పరిమితమైనా వర్మ మాత్రం తనదైన శైలి కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

శివ రంగీలా సత్య కంపెనీ సర్కార్ వీరప్పన్ వంటి మాస్టర్ పీస్ చిత్రాలని అందించి దర్శకుడిగా సంచలనం సృష్టించిన వర్మ గత కొంత కాలంగా తన స్థాయికి భిన్నంగా మరీ చెప్పాలంటే తన స్థాయిని తగ్గించే బీ గ్రేడ్ చిత్రాలు రూపొందిస్తూ వాటినే వివాదంగా మలుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇటీవల గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ ఓ బీగ్రేడ్ ఫిల్మ్‌ని రూపొందించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. షాద్ నగర్ ఎన్ కౌంటర్ ని క్యాష్ చేసుకోవాలని `దిశ ఎన్ కౌంటర్` పేరుతో ఓ సినిమా చేసి విమర్శల పాలయ్యారు.

గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్‌లతో సందడి చేస్తున్న వర్మ తాజాగా ప్రేమ సెక్స్ పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. `లవ్ ఈజ్ ఎబౌట్ కెమిస్ట్రీ .. బట్ సెక్స్ ఈజ్ ఫిజిక్స్ ` అంటూ వర్మ చేసిన తాజా ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. వర్మ చేసిన తాజా బోల్డ్ కామెంట్స్ పై నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

సెక్స్ ఈజ్ ఫిజికల్లీ కెమిస్ట్రీ` అని.. ప్రెగ్నెన్సీ బయోలజీ అని...లస్ట్ మేథమెటిక్స్ అని.. నిత్యానందని దీని గురించి అడిగితే మీకు డిటైల్డ్ గా వివరిస్తాడని మరొకరు... బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్ వున్న ఫొటోని పోస్ట్ చేసిన ఓ నెటిజన్ `ఏమో మావ పిచ్చోళ్లు మాట్లాడితే మేధావులకు అర్థం కాదు అంటారు.. కానీ బ్రతుకుతున్నది మాత్రం సోషలిజం మీదనే మావ అది మాత్రం మర్చిపోకు అంటూ వర్మకు చీవాట్లు పెడుతున్నారు.