Begin typing your search above and press return to search.

#RGV మావా నీకున్న సుఖం లోకంలో ఎవరికైనా దొరుకునా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 7:38 AM GMT
#RGV మావా నీకున్న సుఖం లోకంలో ఎవరికైనా దొరుకునా?
X
నారీ నారీ నాడుమ సోగ్గాడిలా ఆర్జీవీ విలాసం చూస్తుంటే కుళ్లుకోని వారు ఎవ‌రైనా ఉంటారా? ఇటీవ‌లి కాలంలో టీవీ యాంక‌ర్లను బిగ్ బాస్ స్టార్ల‌ను సినీతార‌లుగా మ‌లిచే ప‌నిలో ఉన్న ఆర్జీవీ వారికి కావాల్సినంత ప‌బ్లిసిటీని ఇస్తున్నారు. బోల్డ్ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల‌తో వెబ్ లో మంట‌లు పుట్టిస్తున్నారు ఆర్జీవీ.

`అంతా నా ఇష్టం` అన్న చందంగా ఆయ‌న చేస్తున్న బోల్డ్ ఇంట‌ర్వ్యూలు వెబ్ లో ద‌డ పుట్టిస్తున్నాయి. ఇంత‌కుముందు అరియానా.. నిన్న గాక మొన్న అషు రెడ్డి బోల్డ్ ఇంట‌ర్వ్యూలు వెబ్ ని షేక్ చేశాయి. ఇప్పుడు ఆ ఇద్ద‌రు బిగ్ బాస్ బ్యూటీల‌తో క‌లిసి ఆర్జీవీ ప‌బ్బులో పార్టీ చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

అరియానా - అషు రెడ్డి కంటే ఎక్కువ మంది యువతులు మరింత ధైర్యంగా నిజాయితీగా బోల్డ్ గా మారుతారని నేను ఆశిస్తున్నాను. యాధృచ్ఛికంగా అయినా వారి ముఖాలతో పాటు నా షూస్ ని చూడ‌డం మిస్స‌వ్వ‌కండి! అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. నారీ నారీ న‌డుమ ఆర్జీవీ ఓ రేంజులోనే ఎంజాయ్ చేస్తుంటే దానికి నెటిజ‌నుల స్పంద‌న‌లు కాక‌లు పుట్టిస్తున్నాయి. ఆర్జీవీ జాలీ లైఫ్ సెల‌బ్రేష‌న్ విష‌యంలో బోయ్స్ అంతా కుళ్లుకుపోతున్నారు.

ఒక కుర్రాడు అయితే ``మావా నీకు ఉన్న సుఖం లోకంలో ఎవ‌రికి అయినా దొరుకుతుందా చెప్పు`` అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇంకా బోయ్స్ నుంచి ఆ ఇద్ద‌రు మ‌గువ‌ల‌పైనా బోలెడ‌న్ని బోల్డ్ కామెంట్లు ప‌డిపోతున్నాయ్. అన్న‌ట్టు ఆర్జీవీ కొత్త షూస్ ని చూసారు క‌దా.. త‌ళ‌త‌ళా మెరిసిపోతున్నాయ్ స్పోర్ట్ బ్రాండ్ ఏంటో కానీ..! అదంతా స‌రే కానీ.. త‌న డీకంపెనీ సినిమాల్ని రిలీజ్ చేయ‌కుండా ఇంకా ఎన్నాళ్ల‌ని ఇలా మ‌గువ‌ల‌తో ఎంజాయ్ చేస్తారు..? అంటూ కొంద‌రు యూత్ ప్ర‌శ్న‌ల్ని కురిపిస్తున్నారు.