ఆర్జీవీ 'డేంజరస్' వీడియో సాంగ్: ప్రపంచంలోనే ఫస్ట్ లెస్బియన్ డ్యూయెట్..!

Fri Oct 22 2021 19:32:05 GMT+0530 (IST)

RGV Khatra Video Song From Dangerous Movie

'శివ' తో సినిమా మేకింగ్ లో ఎన్నో ప్రయోగాలకు నాంది పలికింది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు ''డేంజరస్'' అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది ఇండియాలోని ఫస్ట్ లెస్బియన్ లవ్ - క్రైమ్ - యాక్షన్ ఫిల్మ్ అని ఆర్జీవీ పేర్కొన్నారు. వర్మ బ్యూటీస్ నైనా గంగూలీ - అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.''డేంజరస్'' సినిమా ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన హై ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని రామ్ గోపాల్ వర్మ ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే హీరోయిన్ల మధ్య లిప్ లాక్ పోస్టర్స్ - డేంజరస్ ట్రైలర్ వదిలి సంచలనం రేపాడు. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని ఓ సాంగ్ ని విడుదల చేశారు ఆర్జీవీ.

'ఖత్రా' అనే ఈ పాట ప్రపంచంలోనే ఇద్దరు మహిళల మధ్య చిత్రీకరించిన మొట్టమొదటి లెస్బియన్ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ అని.. అలానే ఆర్టికల్ 377 సవరించిన తర్వాత ఇండియాలో ఫస్ట్ లెస్బియన్ డ్యూయెట్ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. నైనా గంగూలీ - అప్సర రాణి లపై షూట్ చేసిన ఈ పాట.. వర్మ సినిమాలను ఇష్టపడే వారికి విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.

నైనా - అప్సర ఇద్దరూ ఈ పాటలో ఒకరికి మించి మరొకరు పోటీపడి అందాలు ఆరబోశారు. ఇందులో ఇద్దరి మధ్య గాఢమైన లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. నైట్ ఎఫెక్ట్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లో ఆర్జీవీ తరహా కెమెరా యాంగిల్స్ కి డోకా లేదు. మరి ఈ లెస్బియన్ డ్యూయెట్ సాంగ్ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

'డేంజరస్' అనేది 90 నిమిషాల సినిమా అని ఆర్జీవీ తెలిపారు. అలానే ఇది వరల్డ్ లోనే బ్లాక్ చైన్ లో సేల్ కి పెట్టిన ఫీచర్ ఫిల్మ్ అని పేర్కొన్నారు. లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ అంటూ ఆర్జీవీ చేస్తున్న ఈ డేంజరస్ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.