Begin typing your search above and press return to search.

బాలయ్యనే దిష్ఠిబొమ్మ అంటావా?

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:06 AM GMT
బాలయ్యనే దిష్ఠిబొమ్మ అంటావా?
X
మూడు రాజధానుల బిల్లు విషయమై మండలిలో చాలా హాట్‌ హాట్‌ గా చర్చ జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అంతా కూడా మండలి గ్యాలరీలో కూర్చుని సభ్యుల స్పీచ్‌ లు వినేందుకు వెళ్లారు. ఆ సమయంలో తెలుగు దేశం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ పక్కనే వైకాపా ఎమ్మెల్యే అయిన రోజా కూర్చున్నారు. అదే సమయంలో సెల్ఫీ తీసుకోవడం ఇతర వైకాపా ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం జరిగింది. బాలకృష్ణ.. రోజాల సెల్ఫీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వైరల్‌ విషయాల పై ఎప్పుడు ఏదో ఒక కామెంట్‌ చేస్తూ ఉండే వర్మ ఈసారి ఈ సెల్ఫీపై స్పందించాడు. ఈ ఫొటోను ట్వీట్‌ చేసిన వర్మ రోజా గారు చూడ్డానికి హీరోలా ఉన్నారు. కాని ఆమెకు కుడి పక్కన ఉన్నది ఎవరో తెలియదు కాని బాలేడు. ఆయన రోజా గారి అందంను నాశనం చేసే విధంగా ఉన్నాడు. లేదంటే అతడు ఆమె యొక్క దిష్టి బొమ్మ అయ్యి ఉంటాడు అంటూ వర్మ రెండు వేరు వేరు ట్వీట్స్‌ చేశాడు. ఈ ట్వీట్స్‌ పై బాలయ్య ఫైన్స్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ బాలకృష్ణ తో సెల్ఫీ తీసుకుంటున్నది రోజా. ఆమె కోరుకుని బాలయ్యపై ఉన్న గౌరవం మరియు అభిమానంతో సెల్ఫీ తీసుకుంటుంది. అది బాలయ్య స్థాయి. ఆయన అంటే వైకాపా ఎమ్మెల్యేల్లో కూడా చాలా మందికి అభిమానం. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక గొప్ప నటుడు.. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ దక్కించుకున్న నటుడు బాలకృష్ణ. అలాంటి గొప్ప నటుడిని దిష్టి బొమ్మ అంటావా అంటూ తీవ్ర స్థాయిలో వర్మపై బూతులతో విరుచుకు పడుతున్నారు. నీ స్థాయిని మరింతగా దిగజార్చుకుంటూ ఉన్నావని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు నెటిజన్స్‌ బాలయ్య పక్కన్న వర్మ కూర్చుని ఉన్న ఫొటోలను జత చేసి ఈ ఫొటోలో బాలకృష్ణ కు నీవు దిష్టి బొమ్మలా ఉన్నావంటూ కామెంట్స్‌ చేశారు. మొత్తానికి వర్మ మరోసారి నందమూరి ఫ్యాన్స్‌ ను కెలికి తిట్ల కామెంట్స్‌ తో తన ఇన్‌ బాక్స్‌ ను ఫుల్‌ చేసుకుంటున్నాడు.