సిరివెన్నెల మరణంపైనా ఆర్జీవీ మార్క్ ఛమత్కారం

Wed Dec 01 2021 21:17:03 GMT+0530 (IST)

RGV Comments On Sirivennela Death

ఛమత్కారం అంటే ఏమిటో వర్మని చూసి నేర్వాలి. ఆయనలోని వైవిధ్యమైన థింకింగ్ కి ఒక సెక్షన్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు సిరివెన్నెల మరణంపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.



సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించడం తనకు హ్యాపీగా ఉందని వర్మ వ్యాఖ్యానించారు. అయితే ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వర్మ.. శివ సినిమాకి బోటనీ పాటముంది పాటను రాశారని ఆ తర్వాత తన ప్రతి సినిమాకి ఆర్జీవీ పని చేశారని తెలిపారు. ఆయన ఇక్కడి కంటే బెటర్ ప్లేస్ కి వెళ్లారని స్వర్గంలో కొత్త ప్రేక్షకులకు తనకు ఉన్నారని వర్మ అన్నారు.

``సిరివెన్నెల ను నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటిసారి కలిశాను. శివ సినిమా కు ఒక మంచి కాలేజ్ సాంగ్ కావాలి అని అడగగానే `బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది` అంటూ టక్కున చెప్పేశారు.. ఆ పాట తరువాత నా ప్రతి సినిమాలో ఆయనతో పాటలు రాయించాను. మనిషి అన్నాకా చనిపోవడం సాధారణం.. అందరు ఎప్పుడో ఒకప్పుడు పోతారు.. కానీ ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్న మీరు కన్నుమూయడం కొంచెం బాధగా ఉన్నా.. సంతోషంగా ఉంది. తెలివి ఉన్నవాడు ఎవ్వడైనా సరే ఆనందపడతాడు. ఎందుకంటే మీరు ఇక్కడ కంటే బెటర్ ప్లేస్ కి వెళ్లారు. ఫ్యామిలీ మిస్ అవుతారు అనేది నాకు సంబంధం లేదు ..నేను ఒక ప్రేక్షకుడిగా నా స్వార్థంతో నేను చెప్తున్నాను.. మీరు అక్కడికి వెళ్లడం నాకు హ్యాపీగా ఉంది.

ఇకపై మీకు పైలోకంలో కొత్త ప్రేక్షక మహాశయులు ఉంటారు. నేనెప్పుడూ రంభ- ఊర్వశి- మేనక- తిలోత్తమ లను చూడలేదు.. మీరు చూడండి .. వారికి నేను హాయ్ చెప్పానని చెప్పండి. ఇప్పటివరకు మీతో ఒక్కసారి కూడా వోడ్కా తాగలేదు.. ఒక వేళ నా తప్పులలో ఏమైనా తప్పుగా ఉండి యముడు నన్ను స్వర్గానికి కనుక తీసుకొస్తే అక్కడ మీతో వోడ్కా తాగుతాను. మీరు లక్కీగా అక్కడికి వెళ్లి స్వర్గం చూస్తున్నారు. అక్కడ వాట్సప్ కనుక ఉంటే కనుక అమృతం టేస్ట్ ఎలా ఉంది ..? రంభ ఊర్వశి- మేనక- తిలోత్తమ ఎలా ఉన్నారో నాకు చెప్పండి.. అంటూ వర్మ అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ వరుస వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.