Begin typing your search above and press return to search.

RC15 అప్‌డేట్ ప్లీజ్‌..!

By:  Tupaki Desk   |   17 Aug 2022 4:20 PM GMT
RC15 అప్‌డేట్ ప్లీజ్‌..!
X
రామ్‌ చరణ్.. శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా లో రామ్‌ చరణ్‌ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ విషయం దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఇక రామ్‌ చరణ్ మరియు శంకర్‌ ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారట.

ఇండియన్ 2 సినిమా యొక్క షూటింగ్ ను ముగించడం కోసం శంకర్‌ రెండు నెలల గ్యాప్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. షూటింగ్‌ పూర్తి విషయం పక్కన పెడితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్‌ లుక్ వస్తుందని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. ఇంకా ఎప్పుడు సినిమా ఫస్ట్‌ లుక్ విడుదల చేస్తారంటూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన పలు పోస్టర్ లు లీక్ అయ్యాయి. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు శంకర్ ఆర్‌ సీ 15 యొక్క అప్డేట్‌ ఇవ్వక పోవడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్‌ చరణ్ స్థాయి అమాంతం పెరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన సినిమా లకు మంచి మార్కెట్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ సగానికి పైగా పూర్తి అయిన ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ నిర్మాత దిల్‌ రాజు గతంలో ప్రకటించాడు. మరి అదే విడుదల తేదీకి ఆర్‌ సీ 15 విడుదల అయ్యేనా అనేది చూడాలి.