Begin typing your search above and press return to search.

RC15: 500 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్ సాంగ్

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
RC15: 500 మంది డ్యాన్సర్లతో రామ్ చరణ్ సాంగ్
X
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లెవెల్ లో గుర్తింపు రావడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కమల్ హాసన్ ఇండియన్ 2 కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

ఇక చరణ్ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ సినిమాకు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే మరోసారి మరోసారి రామ్ చరణ్- శంకర్ కాంబోపై ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇండియన్-2 షూటింగ్ ఇటీవలే పూర్తయిందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. దీంతో రామ్ చరణ్‌తో సినిమాను శంకర్ తిరిగి పట్టాలెక్కించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఆర్సీ 16 మూవీ త్వరలోనే తిరిగి పునఃప్రారంభం కానుందని సమాచారం. ముందుగా చరణ్‌పై ఓ భారీ సాంగ్‌ను చిత్రీకరించేందుకు పనులు ప్రారంభించారని తెలుస్తోంది.

ఇందుకోసం 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించారు. శంకర్ భారీ స్థాయిలో పాటల చిత్రీకరణలో స్పెషల్ ఆలోచనలతో శంకర్‌ కు మంచి గుర్తింపు ఉంది. ఈ వారం చివర్లోనే ఈ సాంగ్ షూటింగ్ ను ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమాలో రామ్‌ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ తో ఈ భామ ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో నటిచింది. ఇది కియారాకు రెండో సినిమా. రామ్‌ చరణ్ శంకర్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.

ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతుందని సినీ వర్గాల సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్, అంజలి, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే బడ్జెట్ పరంగా ఖర్చు విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు మధ్య విభేధాలు తలెత్తాయని అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. కానీ అవి ఊహాగానాలే అని అర్థం అవుతోంది. శంకర్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఇస్తూ తెరకెక్కిస్తారు. ఇక రామ్ చరణ్‌తో సినిమా కూడా ఇదే కోవలో రాబోతుందని తెలుస్తోంది. చూడాలి ఈసారి ఏ రేంజ్ లో హిట్ కొట్టనుందో!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.