ఏదో ఒకటి తేల్చుకోండి శంకర్ గారు!

Sat Apr 01 2023 10:00:32 GMT+0530 (India Standard Time)

RC15 Gamechager  On Considered For Release

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టైటిల్ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేవిధంగా ఉండడంతో ఓకింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి సాంగ్ షూటింగ్ జరుగుతూ ఉంది.ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ చిత్రీకరణ హైదరాబాదులో చేస్తూన్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటన చేసిన కూడా అది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది.

 దిల్ రాజు శంకర్ మరో డేట్ ని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండడంతో ఆల్టర్నేటివ్ గా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఒక డేట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ బట్టి తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉన్న ఇండియన్ 2 మూవీ రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.

అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతూ ఉన్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఈ నేపథ్యంలోనూ సరైన టైంలో ఇండియన్ 2 రిలీజ్ చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్ సినిమా సినిమా డిసెంబర్ రిలీజ్ చేస్తే కమలహాసన్ ఇండియన్ 2ని వేసవి కానుకగా అందించడానికి శంకర్ ప్లానింగ్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

మరి రెండు సినిమాల డేట్స్ అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పాన్ ఇండియా ట్రెండ్ సౌత్ లో స్టార్ట్ అయ్యాక సినిమాల రిలీజ్ ల విషయంలో ఇప్పుడు చాలా టఫ్ కాంపిటేషన్ ఏర్పడుతుంది అని చెప్పాలి.