టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు కి ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన సినిమాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనే టాక్ ఉంది. హీరో మార్కెట్ మరియు దర్శకుడి స్టామినాను బట్టి దిల్ రాజు సినిమాను నిర్మిస్తాడు. కథకు తగ్గట్లుగా మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటాడు. అలాంటి నిర్మాత కావడం వల్లే దిల్ రాజు ఖాతాలో కమర్షియల్ డిజాస్టర్స్ చాలా తక్కువ అనే టాక్ ఉంది.
దిల్ రాజు ఏ సినిమా చేసినా కూడా కమర్షియల్ గా ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు అనేది అందరికి తెల్సిందే. ఇటీవల వచ్చిన తమిళ్ సూపర్ స్టార్ వారసుడు సినిమా కూడా ఆయన బడ్జెట్ ను పరిధిలో ఉంచే నిర్మించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి పై ఒత్తిడి చేసి బడ్జెట్ కుదించాడు అనేది ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ టాక్.
అలాంటి దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఎలా సినిమాను నిర్మిస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. శంకర్ వంద రూపాయలతో తీయాలి అనుకుని మొదలు పెడితే అది కచ్చితంగా రెండు వందలు లేదా రెండు వందల యాబైకి చేరుతుంది. అంటే బడ్జెట్ రెట్టింపు లేదా అంతకు మించి అవుతుంది.
శంకర్ తో దిల్ రాజు బడ్జెట్ విషయంలో ముందస్తుగానే పక్కాగా అగ్రిమెంట్ చేసుకుని ఉంటాడు. ఎంత అగ్రిమెంట్ చేసుకున్నా కూడా బడ్జెట్ అనేది పెరగకుండా ఉండదు. పైగా రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భారీగా ఖర్చు తప్పదు.
దిల్ రాజు ఆ బడ్జెట్ ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా పూర్తి అయ్యి.. విడుదల సమయం వరకు సినిమా బడ్జెట్ గురించి ఏదైనా వివాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
శంకర్ దర్శకత్వంలో సినిమా కనుక దిల్ రాజు బడ్జెట్ విషయంలో స్వేచ్చ ఇచ్చాడా... లేదా బడ్జెట్ ను దిల్ రాజు కట్టడి చేసే విధంగా శంకర్ ను ఒత్తిడి చేస్తున్నాడా అనేది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయ్యింది.. కనుక బడ్జెట్ పెరిగి ఉంటుంది. ఆ పెరిగిన బడ్జెట్ లెక్కలు ఏంటీ.. వాటి వల్ల దిల్ రాజు కోల్పోబోతున్నది ఏంటీ అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.