Begin typing your search above and press return to search.
యూనివర్శిటీలో గ్రూప్-1..2 లీకులు.. ఎవర్ని కెలుకుతున్నట్లు?
By: Tupaki Desk | 29 May 2023 10:56 AMవిప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ . నారాయణమూర్తి సంచలనాత్మక చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. బడుగు..బలహీన వర్గాల సమస్యల్ని ఎన్నో చిత్రాల ద్వారా కళ్లకు కట్టారు. ప్రజావ్యతిరేక తిరుగుబాట్లు ఎన్నింటిని తెరకెక్కించారు. సామాజిక దృక్ఫధంతో ఎన్నో సమస్యల్ని తన సినిమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన ఏకైక దర్శకుడు. ప్రభుత్వాల్ని సైతం ప్రశ్నించేలా మరెన్నో సినిమాలు చేసారు. అందుకే కామ్రేడ్ గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు.
తాజాగా 'యూనివర్శిటీ' టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత చేస్తోన్న చిత్రమిది. తాజాగా ఈ సినిమాలో సంచలన అంశాల్నే టచ్ చేసినట్లు తెలుస్తుంది. మనదేశం నిరుద్యోగ భారతం కాదు..ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే ప్రయత్నం తమ సినిమా అంటున్నారు.
గ్రూప్ -1..2లాంటి ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరిగితే విద్యార్ధుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? ఇలాంటి అంశాల్ని ప్రశ్నిస్తూనే కథలో కావాల్సినంత వినోదం కూడా జోడించినట్లు తెలిపారు.
విద్యావ్యవస్థ..ఉద్యోగ వ్యవస్థల నేపథ్యంలో చర్చించిన అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఆలోచన రేకెత్తిస్తాయి అని నారాయణ మూర్తి తెలిపారు. మొత్తానికి యూనివర్శిటీ ద్వారా సంలచన అంశాన్నే టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీష్ కమీషన్ పేపరు లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఏకంగా గ్రూప్ పరీక్షలకు సంబంధించిన పేపరే లీక్ అవ్వడంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు తెరపైక వచ్చాయి.
గతంలోనూ పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి లీకులు జరిగాయి. అలాగే రైల్వే పరీక్షల పేపరు లీకేజులు గత ప్రభుత్వంలో హాట్ టాపిక్ గా మారిన అంశాలే. కానీ గ్రూప్స్ కి సంబంధించి లీకులు ఎక్కడా జరగలేదు. ఆ రకంగా తెలంగాణ పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. మరి నారాయణ మూర్తి ఏ అంశాన్ని టచ్ చేస్తున్నారు? అన్నది తెలియాలి. అన్ని పనులు పూర్తిచేసుకుని జూన్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.