Begin typing your search above and press return to search.

పుష్ప కు ఆ లోటు భర్తీ చేసేది ఎవరు?

By:  Tupaki Desk   |   29 Sep 2020 2:45 AM GMT
పుష్ప కు ఆ లోటు భర్తీ చేసేది ఎవరు?
X
అల్లు అర్జున్‌ సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందబోతున్న 'పుష్ప' సినిమా షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుకున్నట్లుగా ఈ సినిమా గత ఏడాది షూటింగ్‌ ప్రారంభం అయినట్లేతే విజయ్‌ సేతుపతి పుష్పలో భాగస్వామి అయ్యేవాడు. కాని షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో పుష్ప నుండి విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి తప్పుకున్నాడు. ఆయన ఇతర ప్రాజెక్ట్‌ లకు ముందుగానే కమిట్‌ అవ్వడం వల్ల పుష్ప సినిమా చేయాలని ఉన్నా కూడా తప్పుకోవాల్సి వచ్చిందని విజయ్‌ సేతుపతి సన్నిహితులు చెబుతున్నారు. అప్పటి నుండి ఆ పాత్రకు పలువురు నటీనటులను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌.. కోలీవుడ్‌.. శాండిల్‌ వుడ్‌ నటులను ఆ పాత్ర కోసం సంప్రదించారంటూ వార్తలు వచ్చాయి. మొదటగా బాలీవుడ్‌ నటుడు ఆ పాత్రకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉపేంద్ర పేరు కూడా వినిపించింది. తమిళ నటులు అరవింద్‌ స్వామి తెలుగు హీరో నారా రోహిత్‌ లను కూడా సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈమద్య మాధవన్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. బాబీ సింహా ను కూడా ఈ సినిమా కోసం సంప్రదించారనే వార్తలు వచ్చాయి.

సినిమాకు అతి కీలకమైన ఆ పాత్రను చేసేందుకు చాలా మంది సీనియర్‌ నటులు సిద్దంగా ఉన్నారు కాని సుకుమార్‌ అంచనాలు అందుకునేది ఎవరు.. విజయ్ సేతుపతి వంటి విలోణ నటనతో ఆకట్టుకునే వారు ఎవరు ఆయన తప్పుకున్న లోటును తీర్చేది ఎవరు అనేది వచ్చే నెల షూటింగ్‌ ఆరంభం అయితే కాని క్లారిటీ వచ్చేలా లేదు. చివరకు మళ్లీ విజయ్ సేతుపతిని నటింపజేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే చాలా గ్యాప్‌ వచ్చింది కనుక విజయ్‌ సేతుపతి తన ఇతర ప్రాజెక్ట్‌ లను పూర్తి చేసి పుష్ప కు మళ్లీ వస్తాడేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.