సైరన్ మోగించిన పుష్పరాజ్ కారణమిదే

Tue Jun 15 2021 22:00:01 GMT+0530 (IST)

Pushpa Raj is restarting

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం  `పుష్ప`పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇది డ్యూయాలజీ కేటగిరీలో తెరకెక్కుతోంది. పుష్ప తొలి పోస్టర్ నుంచే సినిమాపై అంచనాలు స్కైని టచ్ చేసాయి. వరుస ప్రచార చిత్రాలు టీజర్ అంతే క్యూరియాసిటీ ని పెంచాయి. బన్నిలో మాస్ యాంగిల్ బాగా కనెక్టయింది.ఇప్పటికే పార్ట్ -1 ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్  భావిస్తోంది. అయితే కరోనా కారణంగా అడ్డంకులు తప్పడం లేదు. యూనిట్ సభ్యులు సైతం వైరస్ బారిన పడటంతో ఆటంకం  ఏర్పడింది. బన్నీ కూడా మహమ్మారిని జయించి  బయటపడిన  సంగతి  తెలిసిందే.

అయితే సెకండ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం నెమ్మదించింది. పరిస్థితులు  అదుపులోకి వస్తున్నాయి. దీంతో షూటింగ్ లు కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇటీవలే  నితిన్ హీరోగా నటిస్తోన్న మ్యాస్ట్రో (అంధాధున్ రీమేక్) షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యలో పుష్ప కూడా సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈనెలాఖరునుంచి షూటింగ్ ప్రారంభించి జులై 25వ తేదీ నాటికి మొదటి పార్ట్ పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నారు.