ట్రైలర్ కి ఒక రోజు ముందు పుష్ప రాజ్ ఇలా!

Sun Dec 05 2021 12:24:31 GMT+0530 (IST)

Pushpa Movie Making Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ పాటలకు అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాలో ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకం.. పుష్పరాజ్ అనే గంధపు చక్కల స్మగ్లర్ గా బన్ని నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్.. అనసూయ... రష్మిక మందన పాత్రలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా పాత్రల లుక్ లకు స్పందనలు అద్భుతం.ట్రైలర్ తో పుష్ప మరోసారి రికార్డులను తిరగరాసే వీలుందని అంచనా. 06-12-2021 ట్రైలర్ డేట్ అని ఇప్పటికే టీమ్ వెల్లడించింది. తాజాగా మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను పుష్ప టీమ్ రివీల్ చేసింది. ఇందులో బన్ని ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది. నిజానికి పచ్చని అడవుల్లోకి వెళ్లి అక్కడ షూటింగ్ పేరుతో కలుషితం చేయడం సరికాదు. ఈ విషయాన్ని బన్ని ఎంతో క్లారిటీగా తన టీమ్ కి వివరించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. తాగి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాల(కప్స్ -బాటిల్స్ -పేపర్ల)ను డస్ట్ బిన్ లో వేసి ఎవరికి వారు బయట దూరంగా పారేయాలని.. ఈ చోటును కలుషితం చేయొద్దని నివేదించారు బన్నీ ఎంతో బాధ్యతగా. పుష్ప రాజ్ టీమ్ ఈ విషయంలో ఎంత కమిట్ మెంట్ తో ఉందో దీనిని బట్టి అర్థమైంది. ఈ వీడియోలో యాక్షన్ మోడ్ లో ఉన్న సుకుమార్ సహా ఇతర చిత్రబృందం కనిపిస్తున్నారు. ఇదే వీడియోలో రేపు ట్రైలర్ కి సమయమాసన్నమైందని కూడా గుర్తు చేశారు. చినుగుల జీన్స్ మాసిన తలకట్టు గుబురు గడ్డంతో బన్ని మాస్ లుక్ ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది.