Begin typing your search above and press return to search.

క్రికెట్ మైదానంలోనూ `పుష్ప‌` ఫీవ‌ర్

By:  Tupaki Desk   |   26 Jan 2022 2:30 PM GMT
క్రికెట్ మైదానంలోనూ `పుష్ప‌` ఫీవ‌ర్
X
ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా సెన్సేష‌న్ `పుష్ప : ది రైజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారింది. ఇప్ప‌డు ప్ర‌పంచం మొత్తం ఎక్క‌డ విన్నా పుష్ప మాటే వినిపిస్తోంది. పుష్ప పాట‌లే మారు మ్రోగుతున్నాయి. షాకింగ్ విష‌యం ఏంటంటే ఈ చిత్రానికి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ క్రికెటర్లు ప్ర‌చార క‌ర్త‌లుగా మారి ఈ మూవీని వైర‌ల్ చేస్తుండ‌టం. ఇది టాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు యావ‌త్ భార‌తీయ సినీ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేస్తోంది.

ఏ స్టార్ సినిమాకి రాని క్రేజ్ బ‌న్నీ చిత్రానికి వ‌స్తుండ‌టంతో ఏంటీ ఈ మాయ అని అంతా అవాక్క‌వుతున్నారు. స్టార్ క్రికెట‌ర్లు ఈ సినిమా మేనియాకు దాసోహం అంటూ స్టెప్పులేస్తూ `పుష్ప‌` సిగ్నేచ‌ర్ స్టెప్ ని వైర‌ల్ చేసేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ జాబితాలో ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఇండియ‌న్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా..తాజాగా వెస్టిండీస్ ఆల్ రౌండ‌ర్ బ్రావో చేరాడు. వీరితో పాటు శ్రీ‌వ‌ల్లి డ్యాన్స్ సిగ్నేచ‌ర్ డ్యాన్స్ స్టెప్ కి సంబంధించిన వీడియోల‌ని సురేష్ రైనా, ఖ‌లీల్ అహ‌మ్మ‌ద్ అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే బుధ‌వారం కొమిల్లా విక్టోరియ‌న్స్ తో బాంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ (బీపీఎల్‌) జ‌రిగింది. ఈ మ్యాచ్ లో బ్రావో క్రికెట్ మైదానంలోనే `పుష్ప‌` సిగ్నేచ‌ర్ స్టెప్ వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ మ్యాచ్ లో బ్రావో కీల‌కమైన మూడు వికెట్ల‌ని ప‌డ‌గొట్టి విక్ట‌రీలో కీల‌కంగా నిలిచాడు. వికెట్ తీసిన త‌రువాత బ్రావో ఆనందంతో డ్యాన్స్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గోయింగ్ విత్ ది ట్రెండ్` అంటూ డేవిడ్ వార్న‌ర్‌చ సురేష్ రైనాల‌ని ట్యాగ్ చేస్తూ `నేను ఎలా చేశాను` అని షేర్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ వీడియోపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫైర్ ఎమోజీల‌తో కామెంట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ వెస్టిండీస్ టోర్నీలో చివ‌రి నాలుగ‌వ స్థానంలో చేరుకోవ‌డంతో విఫ‌ల‌మైన బ్రావో టి20 ప్ర‌పంచ క‌ప్ త‌రువాత బ్రావో న‌వంబ‌ర్ లో అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన విష‌యం తెలిసిందే.