పార్ములా ప్రకారం హిందీలో `పుష్ప `నెంబర్ -1

Mon Jan 17 2022 22:04:51 GMT+0530 (India Standard Time)

Pushpa In Bollywood

పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్` బాలీవుడ్ లో అనూహ్య విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు రోజులు వెల వెలబోయిన థియేటర్లు అటుపై ఒక్కసారిగా హౌస్ ఫుల్ అయ్యాయి. సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ రకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో బెస్ట్ లాంచింగ్ మూవీగా నిలిచింది. ఇక వసూళ్ల పరంగా మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ బాక్సాఫీస్ ఫార్ములా ప్రకారం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏకంగా అమీర్ ఖాన్ సినిమానే తలదన్నిందని చెప్పొచ్చు. `బాహుబలి` రెండు భాగాలు..`3 ఇడియట్స్` కంటే పెద్ద విజయంగా `పుష్ప ది రైజ్` నిలిచింది.`పుష్ప` రిలీజ్ అయ్యే సమయానికి  `స్పైడన్ మ్యాన్`..`83` చిత్రాలు రన్నింగ్ లో ఉండగా వాటినిసైతం పక్కకి నెట్టేసింది. మొదటి వారం అనంతరం `పుష్ప`కి థియేటర్లు పెరగడం వసూళ్ల పరంగా మరింత కలిసొచ్చింది. బాలీవుడ్ మీడియా సైతం `పుష్ప`ని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఇంతకీ అమీర్ ఖాన్ బాక్సాఫీస్ ఫార్ములా అంటే ఏంటి?  సినిమా విజయాన్ని అంచనా వేయడానికి ముందుగా వారంతపు గణాంకాల్ని చూడాలి. వాటిని మొత్తం కలెక్షన్లతో సరిపోల్చాలి. `3 ఇడియట్స్` ఇలా వారంతంలో 40 కోట్లు కాగా ..ఆ సినిమా మొత్తం బిజినెస్ 200 కోట్లు. ఆ మొత్తాన్ని వీకెండ్ లో 5 తో గుణించగా..ఆ సినిమాని చూడ్డానికి జనాలు మళ్లీ మళ్లీ వెళ్లినట్లు చూపిస్తుంది.

`పుష్ప  దిరైజ్` వీకెండ్ టూ మల్టీపుల్ వసూళ్లు 7.04 కోట్లు సాధించింది. ఇది `ఉరి` వసూళ్ల కంటే ఎక్కువ. `ఉరి` 6.87 కోట్లు..`క్వీన్ `6.10 కోట్లు.. `హిందీ మీడియం` 5.45..`బాహుబలి ది బిగినింగ్` 5.31 కోట్ల వసళ్లు సహా `3 ఇడియట్స్`.. `తాన్హాజీ`- ది అన్ సింగ్ వారియర్`..`హౌస్ ఫుల్ 4`.. `బాజీరావు మస్తానీ`.. `కబీర్ సింగ్`..`దంగల్`.. పీకె`. `సింబా`..`భజిరంగ్ భాయిజాన్`..`టైగర్ జిందా హై` వంటి చిత్రాల వసూళ్లను కూడా `పుష్ప దిరైజ్` అధిగమించినట్లు  లెక్కకొస్తుంది. ఆరకంగా అమీర్ ఫార్ములా ప్రకారం చూస్తే సినిమా నెంబర్ 1 ర్యాంక్ లో ఉందన్నది  నిపుణుల అభిప్రాయం.