Begin typing your search above and press return to search.
చిరు (X) బన్ని: వైజాగ్ - కాకినాడ హార్బర్లు ఉండగా..!
By: Tupaki Desk | 30 Jan 2023 8:00 AMవైజాగ్ లోని అతి పెద్ద నౌకాశ్రయం(హార్బర్)లో చాలా సంవత్సరాలుగా టాలీవుడ్ షూటింగులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిరంతరాయంగా తెలుగు సినిమాలకు ఉపయోగపడే అతి భారీ సెటప్ ఉన్న ప్రదేశాలలో ఇది ఒకటి. మెగాస్టార్ చిరంజీవికి సెంటిమెంట్ గా అనేక హిట్స్ అందించిన లెజెండరీ లొకేషన్ ఇది. గ్యాంగ్ లీడర్ కోసం టైటిల్ సాంగ్ ని ఇక్కడే షూట్ చేసారు. `బంగారు కోడిపెట్ట..` పాటలో కొంత భాగాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇవేకాదు.. చిరు స్టెప్పులు అదరగొట్టిన పాటలు చాలా ఇక్కడ తెరకెక్కాయి.
సక్సెస్ ఫుల్ `వాల్తేర్ వీరయ్య` బాస్ పార్టీ పాట చిత్రీకరణ కోసం చిరంజీవి వైజాగ్ హార్బర్ కి వెళతారని చర్చ సాగింది. పాటను చిత్రీకరించడానికి దర్శకుడు కెఎస్ బాబీ వైజాగ్ లేదా కాకినాడ పోర్ట్ కి తీసుకెళ్తారని ఊహించారు. అంతకుముందు ఈ రెండు చోట్లా అల వైకుంఠపురంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా మెగాస్టార్ ప్రారంభ గీతం #BossParty చిత్రీకరణ కోసం కళా దర్శకుడు ఏ.ఎస్.ప్రకాష్ ఒక నిర్దిష్టమైన హార్బర్ సెట్ ను నిర్మించారు.
ఎఎస్ ప్రకాష్ హార్బర్ సెట్ పై మెగాస్టార్ చిరు సక్సెస్ వేదికలపై ప్రశంసలు కురిపించి సంగతి తెలిసిందే. అయితే చిరు విశాఖ పోర్ట్ ని కానీ కాకినాడ పోర్ట్ ని కానీ ఎందుకు ఉపయోగించుకోలేదు! అంటే క్రౌడ్ ని మ్యానేజ్ చేయడం అంత సులువు కాదని గ్రహించారని కథనాలొచ్చాయి. అందుకే ప్రత్యేకమైన సెట్ వేశారని టాక్ వినిపించింది.
ఇప్పుడు చిరు టీమ్ బాటలోనే పుష్ప 2 టీమ్ కూడా హార్బర్ సెట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోందని సమాచారం. వీరయ్య బాస్ పార్టీ పాటను హార్బర్ సెట్ లో చిత్రీకరించగా.. అదే తరహాలో పుష్పరాజ్ (బన్నీ) పైనా ఒక ధీటైన పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ పాట పుష్పలోని దాక్కో దాక్కో మేక - ఎవడ్రా ఎవడ్రా నువ్వు..! తరహాలో చాలా టెంపర్ తో ఎమోషనల్ గా సాగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పుష్ప 2 పాటలు పార్ట్ వన్ పాటల కంటే పెద్ద హిట్ అవుతాయని సుకుమార్ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఫారెస్ట్ సీక్వెన్స్ లను బ్యాంకాక్ సహా ఇతర దేశాలలో చిత్రీకరించనున్నారు.
పుష్ప పాన్ ఇండియా సక్సెస్ తో `పుష్ప 2` కాన్వాస్ అమాంతం మారింది. బడ్జెట్ ని రెట్టింపు చేశారు. స్టార్ కాస్టింగ్ ని వైవిధ్యంగా ఎంచుకున్నారు. ఈసారి హిందీ మార్కెట్ సహా చాలా మార్కెట్లను పుష్ప 2 టార్గెట్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రెట్టించిన ఉత్సాహంతో పుష్ప 2 ని చిత్రీకరిస్తున్నారని సమాచారం.