పెద్ద ప్లానే.. 20 దేశాల్లో పుష్ప 2 రిలీజ్

Mon Dec 05 2022 16:00:32 GMT+0530 (India Standard Time)

Pushpa 2 release in 20 countries

పుష్ప సినిమా ను రష్యా లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప సినిమా ను డబ్ చేయడంతో తెలుగు సినిమా స్థాయి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పెరిగినట్లు అయ్యింది. పుష్ప సక్సెస్ టాక్ దక్కించుకుంటే మరిన్ని దేశాల్లో కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.ఒక వైపు పుష్ప సినిమా ను రష్యా లో విడుదల చేసేందుకు దర్శకుడు సుకుమార్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలోనే పుష్ప 2 కు సంబంధించిన చర్చలు మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.

ఇప్పటికే ఒక చిన్న షెడ్యూల్ ను ముగించిన సుకుమార్ రష్యా నుండి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో షూటింగ్ చేయబోతున్నాట.

ఇక పుష్ప 2 సినిమా ను కేవలం పాన్ ఇండియా మూవీ అన్నట్లుగా కాకుండా పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమా ను ఒకే సారి 20 దేశాల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

కొన్ని దేశాల్లో ఆయా దేశాల యొక్క భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనుండగా మరి కొన్ని దేశాల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తారట.

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమాను 2023 డిసెంబర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.