పూరి- ఛార్మి ఈ కుమ్ముడేంటహే

Mon Sep 16 2019 23:20:37 GMT+0530 (IST)

Puri and Charmee receive keys to the New Range Rover

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఇచ్చిన కిక్కో లేక ఇంకేదో తెలీదు కానీ పూరి- ఛార్మి జోడీలో ఏదో కించిత్ హుషారు కనిపిస్తోంది. ఈ హుషారులోనే దూకుడుగా అనుకున్నది వెంటనే చేసేస్తున్నారు. దేవరకొండతో సినిమా చేయాలనుకున్నారు. వెంటనే లైన్ లో పెట్టేశారు. ఈ సినిమాకి లొకేషన్ల వేటలో పూరి బిజీ. కేజీఎఫ్ హీరో యశ్.. డార్లింగ్ ప్రభాస్ ఇలా పెద్ద రేంజు స్టార్లకు గురి చేసి గాలం వేస్తున్నారు. ఇప్పటికే కథలు వినిపించి క్యూలో ఉంచారు.అదంతా ఓ యాంగిల్ అనుకుంటే.. వేరొక కోణంలో ఈ జోడీ పోష్ యాటిట్యూడ్ బయటపడిందిలా. పాత ఫెయిల్యూర్స్ తో పాటుగానే పాత వస్తువుల్ని- వాహనాల్ని వదిలించుకుంటున్నారనే ఈ సీన్ చూస్తే అర్థమవుతోంది. ఉన్నట్టుండి ఆ ఇద్దరూ ఎవరికి వారు విడివిడిగా ఖరీదైన లగ్జరీ కార్లతో ప్రత్యక్షమై షాకిచ్చారు.  పూరి జగన్నాథ్ రేంజ్ రోవర్ వైట్ కార్ ని సొంతం చేసుకుంటే.. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ ని ఛార్మి కొనుక్కున్నారు. ఆ కార్ల వద్ద నిలబడి ఆ ఇద్దరూ ఇచ్చిన ఫోజు అదిరిపోయింది. ఒక్కో కార్ ఖరీదు ఇంచుమించు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కిక్కు మామూలుగా లేదు. అయితే పూరి కనెక్ట్స్ కి `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ వల్ల 5-6 కోట్ల మేర మిగిలి ఉంటుందని ట్రేడ్ విశ్లేషించింది. ఈలోగానే పూరి- ఛార్మి కొన్ని అడ్వాన్సులు ఏవైనా అందుకున్నారో ఏమో.. ఇదిగో ఇలా ధూమ్ ధామ్ అంటూ ఉంది వ్యవహారం. తెలంగాణ నంబర్ ప్లేట్ తో పెళ్లికూతుళ్లలా రెడీ అయ్యాయి ఆ రెండు కార్లు. ఇక సవారీకి వెళ్లడమే ఆలస్యం.