పూరి 'రొమాంటిక్' వెయిట్ పెంచే మరో స్పెషల్..!

Thu Oct 28 2021 14:23:27 GMT+0530 (IST)

Puri Romantic is another special

పూరి ఆకాష్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రూపొందిన రొమాంటిక్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పూరి జగన్నాధ్ కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా హీరో ఆకాష్ మరియు హీరోయిన్ కేతికను ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడం హైలైట్ గా నిలిచింది. ప్రభాస్ ఇంటర్వ్యూతో సినిమా రేంజ్ మరో లెవల్ అన్నట్లుగా పెరిగి పోయిందట. రొమాంటిక్ సినిమా స్థాయిని విజయ్ దేవరకొండ మరియు ప్రభాస్ లు కలిసి అమాంతం పెంచేశారు.రొమాంటిక్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా చూద్దామా అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఈ స్థాయి ప్రమోషన్ ఏ సినిమాకు దక్కిందే లేదు. సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ మాత్రం భారీగా రావడం ఖాయం అన్నట్లుగా ఉంది. ఈ సమయంలో సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రొమాంటిక్ సినిమా లో ఒక పాటలో ఆకాష్ తో కలిసి ఎనర్జిటిక్ స్టార్ రామ్ మాస్ స్టెప్పులు వేశాడట. ఆ స్టెప్పులు సినిమా రేంజ్ ను మరింతగా పెంచడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి రొమాంటిక్ సినిమా రేంజ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వసూళ్లపై అందరి దృష్టి ఉంది. సినిమా కు వచ్చిన బజ్ నేపథ్యంలో కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఈజీగా పాతిక కోట్లకు మించిన వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రొమాంటిక్ సినిమా టైటిల్ కు తగ్గట్లుగానే రొమాంటిక్ గా ఉండబోతుందని ట్రైలర్ ను చూసిన తర్వాత అర్థం అయ్యింది. ఈ సినిమా లో రమ్యకృష్ణ పాత్ర సినిమా కే హైలైట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా కు చాలా చాలా స్పెషల్స్ ఉన్న కారణంగా సినిమా భారీ అంచనాలను మోస్తుంది. మరి ఈ అంచనాలను ఎంత వరకు సినిమా అందుకుంటుంది అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేను.