పూరి కొటేషన్లు శ్రుతిహాసన్ ఫాలో అవుతుందా!

Sat May 14 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

Puri Quotations Will shruti haasan Follow

మనిషి నిర్జీవం అయ్యేలోపు ప్రతీ ఒక్కరూ రియలైజ్ అవ్వక తప్పదు. పూరి జగన్నాధ్ చెప్పినట్లు ఎవరి జీవితం వారికి తప్పకుండా సరదా తీర్చేస్తుంది. ఆ సరదా తీరిన మరు సెకను  రియలైజేషన్ అవుతాం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఏదో ఒక రోజు కచ్చితంగా ఆస్టేజ్ అనేది వస్తుంది అన్నది పూరి మీనింగ్. మనిషికి అనుభవాలే గుణపాఠాలు నేర్పుతాయి.ఆ తర్వాతే అసలు పాఠాలు నేర్చుకుంటాం. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. నీలా నువ్వు బ్రతకు..నీకు నచ్చినట్లు ఉండు? ఉన్నంతలో సంతోషంగా ఉండు అదే జీవితం అని ఇటీవలి కాలంలో పూరి యూ ట్యూబ్ లో సందేశాలిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరి కోసమంటారా? అయితే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే.

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తండ్రిలాగే మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ.  ఇప్పుడు శ్రుతి హాసన్ పెద్ద హీరోయిన్. కోలీవుడ్..టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటి. తండ్రి ఇమేజ్ తో లాంచ్ అయినా అటుపై ప్రతిభతోనే పైకొచ్చింది. కెరీర్ ని బిల్డ్ చేసుకునే క్రమంలో ఎంతో కష్టపడింది.

తాను అనుకున్నది సాధించగల్గింది. కానీ ఓ విషయంలో మాత్రం తన స్వేచ్ఛని తానే కోల్పోయిందని ఆమె మాటల్ని బట్టి అర్ధమవుతుంది. ఒకప్పుడు ఎదుట వారికి నచ్చేలా ఉండాలని తెగ తాపత్రయపడేదంట. కానీ ఈ క్రమంలో ఎంతో మంది స్నేహితుల్ని..ఆప్తుల్ని కోల్పోయానని వాపోతుంది. ఆ తర్వాత  రియల్ లైఫ్ లో ఎలా బ్రతకాలో అలవాటు చేసుకుందిట.

రియలైజ్ బ్రతికినప్పుడు లైఫ్ విలువ తెలుస్తుందని..చుట్టు పక్కల వారి పట్ల ఎలా మొలుగుతున్నాం..మన పట్ల వాళ్లు ఎలా మసులుకుంటారు? అన్న విషయాలు అర్ధమవుతున్నాయని అంటోంది. అసలైన సంతోషం వాస్తవంలో బ్రతికినప్పుడే ఉంటుందని... అలా కాకపోతే లైఫ్ అంతా మేకప్ వేసుకున్నట్లే జీవించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇలా ఉండటం వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ తాను కోరుకున్నట్లు ఉండగల్గుతున్నప్పుడు మళ్లీ మారాల్సిన అసవరం ఏముందని తనని తానే ప్రశ్నించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. మొత్తానికి శ్రుతి హాసన్ రియాల్టీ  లో జీవించడం అలవాటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే అమ్మడు సీనియర్ హీరోలతో రొమాన్స్ కి రెడీ అయింది. మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`లో... నటసిహ బాలకృష్ణ 107 సినిమాలో నటిస్తుంది. అలాగే  పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న  `సలార్` చిత్రంలో డార్లింగ్ కి జోడీగా నటిస్తోంది.