Begin typing your search above and press return to search.

అందర్నీ ఫూల్స్‌ చేసి బాగానే ప్రమోషన్ చేసుకుందిగా..!

By:  Tupaki Desk   |   30 Oct 2020 11:10 AM GMT
అందర్నీ ఫూల్స్‌ చేసి బాగానే ప్రమోషన్ చేసుకుందిగా..!
X
'బిగ్‌ బాస్' ఫేమ్ పునర్నవి భూపాలం బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫొటో షేర్‌ చేస్తూ 'ఫైనల్లీ ఇట్స్‌ హ్యాపెనింగ్‌' అని పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరం ఉన్న పునర్నవి చేతిని వేరే చేయి పట్టుకుని ఉండటంతో.. ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందా? అని అంతా అనుకుంటుండగా ''నేను ఎస్ చెప్పాల్సి వచ్చింది.. ఉద్భవ్ నేను కలిసి రేపు బిగ్ డే గురించి మీకు చెప్తాను'' అని మరో పోస్ట్ పెట్టింది. దీంతో నటుడు ఉద్భవ్ రఘునందన్ తో పున్నూ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ సస్పెన్స్ కి తెర దించుతూ ఇది పెళ్లి మ్యాటర్‌ కాదని.. ప్రమోషన్‌ మ్యాటర్‌ అని వెల్లడించారు.

తాజాగా పునర్నవి ఇంస్టాగ్రామ్ వేదికగా తాను నటించబోయే వెబ్ సిరీస్ గురించి ప్రకటించింది. 'తప్పక ఒప్పుకున్నా.. ఇకముందు ఉంది అసలైన క్రేజీ రైడ్' అని పోస్ట్ పెడుతూ ''కమిట్ మెంటల్'' వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో రెండు రోజుల నుంచి అమ్మడు ఊరిస్తూ వచ్చిన విషయం పెళ్లి గురించి కాదని.. వెబ్ సిరీస్ గురించని తేలిపోయింది. 'కమిట్ మెంటల్' సిరీస్ 'పర్మినెంట్ రూమ్ మేట్స్' వెబ్ సిరీస్ కి తెలుగు రీమేక్ గా రానుంది. 'ఆహా' కోసం రూపొందుతున్న ఈ సిరీస్ కి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. దీంట్లో ఉద్భవ్ రఘునందన్ - పునర్నవి భూపాలం లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. మొత్తం మీద పున్నూ అందర్నీ ఫూల్స్‌ చేసి వెబ్ సిరీస్ కి ప్రమోషన్ బాగానే చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రెండు రోజుల నుంచి పున్నూ ఈ ట్రోల్స్ అన్నీ చూసి బాగా నవ్వుకోని ఉంటది అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. 'చాలా బాగా' అంటూ రిప్లై ఇచ్చింది. 'ఓర్నీ.. ఇందుకా నువ్వు వెయిట్ చేయమంది.. ఇంకా కమిట్ అయిపోయేమోనని బాధతో బార్ కి వెళ్ళా' అని కామెంట్ పెట్టగా 'అవ్వలేదు.. ఇప్పుడు ఇంట్లో కూర్చో' అని సమాధానం ఇచ్చింది పునర్నవి.