చైతుతో ఫిదా దర్శకుడి సినిమా షురూ

Thu Jun 27 2019 15:40:40 GMT+0530 (IST)

ఫిదా లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ఇవాళ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి క్లాప్ కొట్టేశారు. సికంద్రాబాద్ గణేష్ టెంపుల్ లో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. అతిధులును ఎవరినైనా పిలిచారేమో తెలియదు కాని విజయనిర్మల గారి మరణం దృష్ట్యా  ప్రత్యేక ఆహ్వానితులు ఎవరూ పెద్దగా కనిపించలేదు.నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరూ హాజరయ్యారు. ఈ కాంబోలో ఇదే మొదటి మూవీ. సాయి పల్లవికి ఫిదా రూపంలో చాల పెద్ద బ్రేక్ ఇచ్చిన శేఖర్ కమ్ముల ఆ మధ్య కొత్త స్టార్ క్యాస్టింగ్ తో ఓ సినిమా మొదలుపెట్టి అవుట్ ఫుట్ సరిగా రాని కారణంగా దాన్ని డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. చైతు శేఖర్ కమ్ముల మధ్య ఇంతకు ముందే ఓ కమిట్ మెంట్ పెండింగ్ లో ఉండటంతో అది ఈ రూపంలో నెరవేరింది

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో  నాగ చైతన్య సాయి పల్లవిలు డాన్సర్స్ గా కనిపిస్తారట. అందుకే మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిసింది. అది వెస్ట్రన్ డాన్సా లేక శాస్త్రీయమా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి శేఖర్ కమ్మల ఏదో డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తున్నాడు. తక్కువ టైంలో షూటింగ్ పూర్తయ్యేలా సెట్  చేసిన ఈ మూవీలో ఏడాది చివరిలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇతర తారాగణం టీమ్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం చైతు వెంకీ మామ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళిపోయాడు. అది ఇంకో నెలలో పూర్తవుతుంది. ఆపై కంటిన్యూ గా శేఖర్ కమ్ముల సినిమాలో కొనసాగనున్నాడు