పఠాన్ సినిమా యొక్క బేషరమ్ పాట విడుదల అయినప్పటి నుండి కూడా వివాదం మొదలు అయ్యింది. దీపికా పదుకునే కాషాయం బికినీ కారణంగా హిందూ సంఘాల వారు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు. ఒక స్టార్ హీరోయిన్.. అంతే కాకుండా పెళ్లి అయిన వ్యక్తి ఇలా బికినీ వేసుకోవడం ఏంటో అంటూ చాలా మంది విమర్శలు చేశారు.
ఆ మధ్య ఒక బాలీవుడ్ సీనియర్ నటుడు ముందు ముందు బికినీ కూడా లేకుండా నటిస్తారేమో అంటూ పఠాన్ లోని దీపికా పదుకునే యొక్క బికినీ పై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈమధ్య కాలంలో ఒక హీరోయిన్ బికినీ గురించి ఇంతగా చర్చ ఎప్పుడు జరగలేదు.
గతంలో ఎంతో మంది హీరోయిన్స్ బికినీ వేశారు కానీ కాషాయం రంగు బికినీ వేయడంతో పఠాన్ పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. పాకిస్తానీ యువతి పాత్రలో కనిపించిన దీపికా పదుకునే బికినీ కి సినిమాలో చాలా కట్స్ పడ్డాయి. ఆమె బికినీ కి మాత్రమే కాకుండా ఆమె పాత్రను కూడా మేకర్స్ ఫైనల్ ఎడిట్ లో చాలా లేపేశారంటూ వార్తలు వస్తున్నాయి.
దీపికా అందాల ఆరబోత ఉంటుందని ఆశ పడి సినిమాకు వెళ్లిన వారికి.. ముఖ్యంగా బికినీ షో చేసిన దీపికా ను చూసేందుకు పఠాన్ సినిమాకు వెళ్లిన వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి. పాటలో మరియు ట్రైలర్ లో చూపించినట్లుగా దీపికా క్లోజ్ బికినీ అందాలు సినిమాలో లేవంటూ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
షారుఖ్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి కనిపించిన సన్నివేశాలు దీపికా బికినీ షో కంటే కన్నుల విందుగా ఉన్నాయి అనేది మరి కొందరి మాట. మొత్తానికి పఠాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కి మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. బాలీవుడ్ కు చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ సక్సెస్ పడిందని టాక్ వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.