పిక్ టాక్ : పవన్ ఆ రీమేక్ మొదలు పెట్టబోతున్నాడు ఇదే సాక్ష్యం

Wed Jan 25 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Proof That Pawan is Going to Start That Remake

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగాయి. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ షూట్ లో పాల్గొనబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి.



హరి హర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆ మధ్య మీసాలు పెంచి కనిపించాడు. కానీ తాజాగా కొండగట్టు లో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సింపుల్ గా మీసాలు ట్రిప్ చేసి.. డీసెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంటే పవన్ నిజంగానే రీమేక్ కోసం కొత్త మేకోవర్ తో రెడీ అవుతున్నాడు అనిపిస్తుంది.

వినోదయ్య సిత్తం సినిమాను కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ్య సిత్తం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా పవన్ ఇమేజ్ కు సరిగ్గా సెట్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్ స్వయంగా స్క్రిప్ట్ విషయాలు చూసుకున్నాడట.

పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఆ రీమేక్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వివ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అతి త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే హరి హర వీరమల్లు సినిమా కంటే ముందే ఈ రీమేక్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరియు వినోదయ్య సిత్తం రీమేక్ మాత్రమే కాకుండా సాహో సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాను మరియు ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలో కూడా నటించబోతున్న విషయం తెల్సిందే. ఒక వైపు బస్సు యాత్రకు సిద్ధం అవుతున్న పవన్ ఇన్ని సినిమాల యొక్క షూటింగ్స్ ను ఎప్పుడు చేస్తాడో అంటూ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.