అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ప్రోమో… ఆ పెళ్ళిళ్ళ గొడవఏంటంటే?

Fri Jan 27 2023 20:32:15 GMT+0530 (India Standard Time)

Promo Balayya Questions Pawan About His Marriages

ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అందరికి తెలిసిందే. ఈ షో ఒటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సీజన్ లో స్టార్ హీరోలనే ఎక్కువగా బాలకృష్ణ తన ప్రశ్నలతో తికమక పెట్టారు. అలాగే రాజకీయ ప్రముఖులని కూడా మొదటి సారిగా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారితో సందడి చేయించారు. చంద్రబాబు నాయుడు మొదటి సారిగా ఒక ఎంటర్టైన్మెంట్ టాక్ షోలో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అని చెప్పాలి. అది అన్ స్టాపబుల్ షోకి సాధ్యం అయ్యింది. ఇక ప్రభాస్ ని కూడా అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ మాట్లాడించి అతనిలో ఉన్న ఎనర్జీని బయటకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఎపిసోడ్ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. ఏకంగా ఆహా చానల్ కూడా మొరాయించే స్థాయిలో యూజర్స్ ఎటాక్ జరిగింది. రెండు ఎపిసోడ్స్ గా వచ్చిన ప్రభాస్ ఇంటర్వ్యూ అద్బుతంగా క్లిక్ అయ్యింది. ఇక ఒటీటీ హిస్టరీలోనే ఇప్పుడు మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లో భాగంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా ఆహా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది.

అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో ఫ్యాంట్ లు వేసిన విషయంపై ఆసక్తిగా అడిగారు. అలాగే త్రివిక్రమ్ తో ఫ్రెండ్ షిప్ చేయాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రశ్నకి ఆసక్తిగా సమాధానం చెప్పారు. తరువాత ఇంట్లో రామ్ చరణ్ తో క్లోజ్ ఎందుకు అయ్యారు  అని అడిగితే అవ్వాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. తరువాత ఇక సాయి ధరమ్ తేజ్ ఈ ఎపిసోడ్ లో కొద్ది సేపు సందడి చేసాడు.

 అమ్మాయిలు హర్రర్ సినిమాలలకి తేడా లేదు అంటూ తేజ్ వేసిన సెటైర్ కి ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా బాలకృష్ణ అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఏదో సమాధానం చెప్పాడు. అలాగే చిన్న వయస్సులో మానసిక సంఘర్షణకి గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు అంటూ బాలకృష్ణ ప్రశ్న వేసారు. అయితే దానికి పవన్ కళ్యాణ్ ఏదో ఇంటరెస్టింగ్ సమాధానం చెప్పారు. ఇక అన్నయ్య రూమ్ లోకి వెళ్లి ఫిస్తల్ తీసుకొని అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రోమో కట్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే మొదటి ఎపిసోడ్ లోనే చాలా ఇంటరెస్టింగ్ విషయాలని బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో చెప్పించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో యుట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఎపిసోడ్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.