మహేష్ ప్రభాస్ ఎవరి స్టామినా వారిదే..!

Wed Mar 29 2023 10:31:17 GMT+0530 (India Standard Time)

Project K vs SSMB28 Mahesh to clash with Prabhas on Sankranthi 2024

సూపర్ స్టార్ మహేష్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యారు. అది కూడా వచ్చే సంక్రాంతికి తమ సినిమాల రిలీజ్ డేట్ లతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న SSMB28 సినిమా జనవరి 13 2024 రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతకుముందే ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాను జనవరి 12న రిలీజ్ డేట్ లాక్ చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా వస్తుంది. అలాంటి సినిమాకు మహేష్ పోటీ రావడం హాట్ న్యూస్ గా మారింది.సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అన్నట్టు ఉంటుంది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడటం కామనే. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కె ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగులో మహేష్ కూడా సూపర్ స్టార్ కాబట్టి ప్రభాస్ వర్సెస్ మహేష్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు.

ప్రభాస్ ప్రాజెక్ట్ K కి మహేష్ గట్టి పోటీ ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా తెలుగులో మహేష్ కి ఈక్వల్ రేంజ్ హీరో కాబట్టి ఆ ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి వచ్చినా నష్టమేమి లేదని చెప్పొచ్చు. ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినా ఎవరి స్టామినా వారిదే కాబట్టి ఎవరికి ఉండే కలెక్షన్స్ వారికి ఉంటాయి.

త్రివిక్రమ్ తో మహేష్ మూడవ సినిమా రీసెంట్ ఫస్ట్ లుక్ తోనే ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టి తీరుతాం అన్నట్టు చెప్పేశారు. సినిమాను త్రివిక్రమ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే హడావిడి లేకుండా సంక్రాంతికి రిలీజ్ పెట్టుకున్నారు. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కె కూడా నాగ్ అశ్విన్ తన ఫోకస్ అంతా పెట్టేసి సినిమాను నెక్స్ట్ లెవల్ లో తీస్తున్నారని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడితే మరోసారి తెలుగు సినిమా స్టామినా నేషనల్ వైడ్ తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె వర్సెస్ మహేష్ 28వ సినిమా సూపర్ ఫైట్ ఫ్యాన్స్ కి కూడా మంచి జోష్ ఇస్తుందని ఫిక్స్ అయిపోయారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.