Begin typing your search above and press return to search.

తమిళ స్టార్స్ ని రప్పించే ప్రయత్నంలో నిర్మాతలు..!

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:30 PM GMT
తమిళ స్టార్స్ ని రప్పించే ప్రయత్నంలో నిర్మాతలు..!
X
2023 సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు రెండు తమిళ సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో దళపతి విజయ్ వారసుడు మూవీ స్ట్రైట్ తెలుగు సినిమాలానే భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఓ పక్క మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి రెండు భారీ సినిమాలు వస్తున్నా విజయ్ వారసుడు వెనక్కి తగ్గట్లేదు. దిల్ రాజు వారసుడికి కూడా సమానంగా థియేటర్లు కేటాయిస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు అజిత్ కూడా తను చేస్తున్న తునివు మూవీతో సంక్రాంతి రేసులో నిలుస్తున్నాడు. అజిత్ తునివు సినిమా తమిళ్ లో సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే సినిమా తెగింపు టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 3 కోట్లతో తునివు తెలుగు డబ్బింగ్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

ఏదో తెలుగులో మొక్కుబడిగా రిలీజ్ చేయడమేనా కోలీవుడ్ హీరోలు ఇక్కడ ప్రమోషన్స్ ఏదైనా చేసేది ఉందా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ వారసుడు తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత చేశారు. కచ్చితంగా విజయ్ వారసుడు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తుపాకి సినిమా హిట్ పడినా ఆ తర్వాత తన సినిమాలన్నీ తెలుగు డబ్ అవుతున్నా ఒక్క సినిమాకు కూడా దళపతి విజయ్ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.

ఈ విషయంపై తెలుగు ఆడియన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. తెలుగులో ప్రమోషన్స్ చేయకుండా ఇక్కడ వసూళ్ల పై మాత్రం కన్నేస్తున్నారు తమిళ హీరోలు. అందుకే ఈసారి విజయ్ ని వారసుడు కోసం తెలుగు ప్రమోషన్స్ చేసేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు దిల్ రాజు.

మరోపక్క అజిత్ తునివు కూడా తెలుగు రిలీజ్ ఓకే అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి అజిత్ ని రప్పిస్తారా లేదా అన్నది చూడాలి. అజిత్ కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోనే.. ఆయన సినిమాలు వరుసగా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చాయి. మరి తునివు ప్రమోషన్స్ కి అజిత్ హైదరాబాద్ వస్తారా లేరా అన్నది చూడాలి.

తమిళ హీరోలని తెలుగు ప్రమోషన్స్ చేసేలా మన నిర్మాతలు డిస్కస్ చేస్తున్నారట. తునివు కోసం అజిత్ వచ్చినా రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వారసుడు కోసం విజయ్ రాకపోతే మాత్రం పెద్ద దెబ్బ పడుతుంది. దిల్ రాజు విజయ్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. తెలుగు ఆడియన్స్ అతన్ని ఎంతగా అభిమానిస్తున్నారో చూపించాలని ఈ ఈవెంట్ లో చాలా సర్ ప్రైజ్ లు పెట్టబోతున్నారట. ఇన్ని చేసినా విజయ్ తెలుగు ప్రమోషన్స్ కి వస్తాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.